తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఎస్టీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని వామపక్షాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్-ప్లాన్ చట్టం పేరు మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4న ప్రకటించడంతో మంగళవారం సిపిఎం రాష్ట్ర ఇన్‌చార్జి జి. నాగయ్య అధ్యక్షతన మఖ్దూం భవన్‌లో తొమ్మిది వామపక్షాల నాయకులు సమావేశమై చర్చించారు. ఎస్‌సి, ఎస్‌టి ప్రగతి నిధి పేరిట చట్టం పేరు మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేయడం, చట్టాన్ని నీరుగారుస్తున్న విధానంపై వారు చర్చించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను మార్చాలని ప్రయత్నిస్తే వామపక్ష పార్టీలు దళిత, ఆదివాసీ, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఐఎంఎల్-న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె. గోవర్ధన్, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కెజి రామచందర్, ఎంసిపిఐ(యు) రాష్ట్ర నాయకుడు ఉపేందర్ రెడ్డి, ఎస్‌యుసిఐ(సి) రాష్ట్ర నాయకుడు సిహెచ్ మురహరి, ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు హెచ్చరించారు.