తెలంగాణ

కన్నుల పండువగా మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7: పేదల తిరుపతిగా పుణ్యక్షేతంగ్రా ప్రసిద్ధికెక్కిన మన్యకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఊరేగింపు కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారి ఊరేంగింపునకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకని పునీతులయ్యారు. వివిధ గ్రామాల భజన భక్తులు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తమ భజన కీర్తనలతో భక్తులను ఆకట్టుకున్నారు. రాత్రి పొద్దుపోయాక స్వామివారు మన్యంకొండపైకి చేరారు. గోవిందనామస్మరణతో మన్యంకొండ మార్మోగింది.