తెలంగాణ

వస్తున్నవి క్రిటికల్ కేసులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రాష్టర్రాజధానిలోని ‘నీలోఫర్’ ఆసుపత్రిలో నిత్యం పిల్లల ఏడ్పులు, తల్లిదండ్రుల ఆందోళన, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది హడావుడి కనిపిస్తుంది. వివిధ కారణాల వల్ల సాధారణ ప్రసవానికి అవకాశం లేని గర్భిణీలను ఇక్కడకు తీసుకువచ్చే సమయాల్లో చాలా హడావుడి ఉంటుంది. అలాగే తీవ్రమైన అస్వస్థతకు గురైన చిన్నారులు 24 గంటల పాటూ వస్తూనే ఉంటారు. దాంతో నీలోఫర్‌లో డాక్టర్లు తీవ్రమైన మెంటల్ టెన్షన్‌లో పనిచేస్తుంటారు. ఆంధ్రభూమి ప్రతినిధి మంగళవారం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో క్రిటికల్ పరిస్థితిలో ఉన్న ఇద్దరు గర్భిణీలను, ఐదుగురు చిన్నారులను బంధువులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు గర్భిణీలకు సిజేరియన్ చేస్తే తప్ప తల్లీ, బిడ్డా జీవించే పరిస్థితి కనిపించలేదు.
గత వారంలో సిజేరియన్ ఆపరేషన్ జరిగిన 44 ప్రసవాల్లో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఆసుపత్రి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మరణాలపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఆసుపత్రికి వచ్చి విచారణ చేసింది. తాజాగా జరిగిన విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఈ కమిటీలో సభ్యుడైన డాక్టర్ ప్రతిభ ఈ ప్రతినిధితో చెప్పారు. ఈ కమిటీతో పాటుగా జిల్లా కలెక్టర్‌తో విచారణకు కూడా ఆదేశించడం తెలిసిందే. ప్రభుత్వం నియమించే కమిటీ ఏదైనా తమవంతు సహకారం అందిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. పిల్లల వైద్యం, చికిత్సకు సంబంధించి దేశంలోనే నీలోఫర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటంతో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా చికిత్సకోసం వస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ పిల్లల ఆసుపత్రుల్లో క్రిటికల్‌గా మారిన కేసులన్నీ ఇక్కడికే వస్తుంటాయి. ఐదువందల బెడ్లున్న ఆసుపత్రిలో సాధారణంగా అంతకు రెట్టింపు రోగులను ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని చికిత్స చేస్తుంటారు.ప్రసవాల కోసం మూడు యూనిట్లు, పిల్లల చికిత్సకు ఆరు వార్డులు, పిల్లల సర్జరీలకు మరో మూడు యూనిట్లు ఉన్నాయి. నీలోఫర్‌లో రోజూ సరాసరిన తొమ్మిది మంది గర్భిణీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. గత ఏడాది 6800 ప్రసవాలు జరగ్గా వాటిలో దాదాపు సగం సిజేరియనే్లనని ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరించారు. సిజేరియన్ ఆపరేషన్లన్నీ సీనియర్ డాక్టర్లే చేస్తుంటారని ఆయన చెప్పారు.
అదనపు ఆసుపత్రులు అవసరం
నీలోఫర్ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో రాజధానిలో మరో రెండు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రభుత్వ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. రాజధానిలో ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ, క్రిటికల్ పరిస్థితిలో ఆ దవాఖానాల్లో డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. అందువల్ల నీలోఫర్‌కు తోడుగా, మరో వెయ్యిబెడ్లతో కనీసం రెండు పిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు.