తెలంగాణ

‘నీలోఫర్’పై ఐఏఎస్‌తో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: నీలోఫర్ ఆస్పత్రిలో ఒకేరోజు ఐదుగురు బాలింతలు మరణించిన సంఘటనపై ప్రభుత్వం ఐఏఎస్ విచారణకు ఆదేశించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ రాహుల్ బొజ్జాకు విచారణ బాధ్యత అప్పగించారు. నీలోఫర్ ఘటనపై ఇప్పటికే అంతర్గత విచారణ జరిగింది. ముగ్గురు సభ్యుల విచారణకు డిఎంఇ ఆదేశించారు. ఈ విచారణతో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ విచారణ జరుపుతారు. నిలోఫర్‌లో ఐదుగురు బాలింతలు మరణించిన సంఘటనపై మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. అనంతరం డాక్టర్లతో మరోసారి సమావేశం అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని, అదేవిధంగా తప్పు చేసిన వాళ్లను గుర్తించి శిక్షించడం తప్పనిసరిగా జరగాలని అన్నారు. ఐఎఎస్ అధికారితో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని, నిష్పక్షపాతంగా ఉంటుందని భావించినట్టు మంత్రి చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. పరిపాలన, సాంకేతిక అంశాలను పరిశీలించాలని, వారంలో నివేదిక ఇవ్వాలని సూచించారు. అంతకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన లక్ష్మారెడ్డి త్రిసభ్య కమిటీ మూడు నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తుందని, నివేదిక ఆధారంగా దోషులపై చర్య తీసుకుంటామని చెప్పారు. గత ఏడాది ఒక్క నీలోఫర్‌లోనే 6,795 డెలివరీలు జరిగాయని, జనవరినుంచి ఇప్పటి వరకు 533 జరిగినట్టు మంత్రి తెలిపారు.
ప్రవళికది సహజ మరణం
గాంధీ ఆస్పత్రిలో సాయి ప్రవళిక అనే బాలికది సహజ మరణం అని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆమెకున్న వ్యాధి లక్షణాలను బట్టి ఆరు నుంచి 12 ఏళ్ల లోపు మరణం తప్పదని తేల్చడంతో తిరిగి గాంధీలో డిసెంబర్‌లో చేర్చారని చెప్పారు. బెంగళూరు నిమాన్స్ డాక్టర్లు ప్రవళికకు ఉన్న జబ్బు కారణంగా బతకడం కష్టమని తేల్చారని, ఈ విషయం ప్రవళిక తల్లిదండ్రులకు తెలుసునని చెప్పారు. అయినప్పటికీ ప్రవళిక మృతిపై దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థన పెట్టుకుంటే పరిశీలిస్తామని డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు.