తెలంగాణ

పర్మనెంట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: రాష్ట్రంలోని బిసి, ఎస్‌సి, ఎస్‌టి గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్ట్‌ప్రాతిపదికన టీచర్లుగా పనిచేస్తున్న వారు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో ఏడువేలకుపైగా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో కాంట్రాక్ట్ టీచర్లు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ (మసాబ్‌ట్యాంక్) లోని సంక్షేమభవన్‌కు వందలాది మంది కాంట్రాక్ట్ టీచర్లు మంగళవారం మధ్యాహ్నం వరకు చేరుకుని ఆందోళన చేశారు. వీరిలో 10-15 మంది ప్రతినిధి బృందంగా వెళ్లి సంబంధిత కమిషనర్లకు వినతిపత్రాలు అందచేశారు. ఖాళీల భర్తీ చేసేందుకు ముందే తమ ఉద్యోగాలను (కాంట్రాక్ట్) పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హుమాయూన్‌నగర్ పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారు రెచ్చిపోకుండా ముందు జాగ్రత్త చేర్యలు చేపట్టారు.