తెలంగాణ

12నుంచి మెదక్‌లో సహస్ర చండీ మహాయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఫిబ్రవరి 7: పరమాత్మ లనేకం ఉన్నా దేవుడు ఒక్కడేనని శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి భజన మందిర ప్రాంగణంలో సహస్ర మహాచండీ యాగం కోసం చేస్తున్న ఏర్పాట్లను స్వామిజీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్వామిజీ మాట్లాడారు. విశ్వ పాలినియైన చండికా దేవిని పూజించడం వలన కలియుగంలో ప్రజలు సుఖశాంతులతో, సుభిక్షంగా ఉంటారని ఆగమ వ్యాఖ్యానుసారం తెలుస్తుందని స్వామిజీ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో మాఘ బహుళ విదియ నుండి మాఘ బహుళ పంచమి వరకు (ఈ నెల 12 నుంచి 16 వరకు) శ్రీ సహస్ర చండీ మహాయాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ తెలిపారు. ఇక్కడ ఐదు రోజుల పాటు చండికామాత పూజలు జరుగుతాయ న్నారు. కలియుగంలో శాంతి సమాధానం కలిగేందుకే ఈ యాగాలు నిర్వహిస్తున్నట్లు స్వామిజీ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చండీయాగం తరువాత తెలంగాణ రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చినట్లు స్వామిజీ గుర్తుచేశారు. సహస్ర చండీయాగం విశ్వకల్యాణం కోసమే అని తెలిపారు. అఖిల జగన్మాతను పూజించడం వలన కలియుగంలో ప్రజలు సంతోష కాంతులతో పాటు సుభిక్షంగా ఉంటారని స్వామిజీ తెలిపారు. గణపతి, మహారుద్ర చండీయాగం ఒకటిన్నర సంవత్సరాలుగా 10 చోట్ల నిర్వహించడం జరిగిందని స్వామిజీ తెలిపారు. చండీయాగాలు సంగారెడ్డిలో కూడా నిర్వహించామని తెలిపారు. మెదక్ జిల్లాలో తొలిసారిగా సహస్ర నామ చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చండీ అంటే కోపం, ఈ కోపం నివారించడానికి లోకానికి వ్యతిరేకంగా మాట్లాడి స్ర్తిని తల్లిగా భావించని వారిపట్ల అమ్మకు కోపం వస్తుందన్నారు. ధర్మాన్ని అతిక్రమిస్తే వెంటనే అమ్మ శిక్షిస్తుందని స్వామిజీ తెలిపారు. కాగా ఈ సహస్ర చండీయాగానికి బ్రాహ్మణులు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నారని స్వామిజీ తెలిపారు. ప్రజలందరు పాల్గొని చండీయాగ ఉపదేశాలను స్వీకరించాలని ఆయన కోరారు. చండీయాగాలు పల్లెపల్లెకు విస్తరించాలని ఆయన తెలిపారు. భగవత్ సేవవైపు రుద్రహోమం లక్ష పుష్పార్చనలు చేపడుతున్నట్లు తెలిపారు. గరిక గణపతికి ఇష్టం, సంప్రదాయమైన దుస్తులు ధరించిన వారు ఈ చండీయాగంలో పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు. ధ్యానం, పూజ ఏకాగ్రతకు చిహ్నమన్నారు. అనేక పరమాత్మలు ఉన్నాయి కానీ దేవుడు ఒక్కడేనని స్వామిజీ ప్రకటించారు. ఈ యాగంలో 200 మంది విశిష్ట వేదపండితులు పాల్గొంటారని తెలిపారు. 12న ఉదయం గురువందనం, గణపతి పూజ, స్వస్తివాచనం, యాగశాల ప్రవేశం, దేవతాహ్వానము, పారాయణములు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి రుద్రచండీహవనములు, తరువాత సూర్య నమస్కారాలు ఉంటాయన్నారు. 13న అవాహిత దేవతా పూజ, పారాయణములు, హవనములు, సామూహిక లక్ష దూర్వాపూజ, ప్రదోషపూజ, మంగళ హారతి, రాజోపచార పూజ, తీర్ద ప్రసాద వితరణ, 14న అవాహిత దేవతా పూజ, పారాయణములు, హవనములు, మహాలింగార్చన, పార్థివలింగార్చన, 15న సామూహిక లక్ష పుష్పార్చన, 16న పూర్ణాహుతి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాధవానంద సరస్వతి స్వామిజీ తెలిపారు.

చిత్రం..మెదక్‌లో జరుగుతున్న చండీయాగ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాధవానంద సరస్వతి స్వామిజీ