తెలంగాణ

ఆశ్వవాహనంపై రామలింగేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 7: నల్లగొండ జిల్లా చెర్వుగట్టు శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి అశ్వవాహన సేవ, దోపోత్సవం, వసంతోత్సవం, పుష్పోత్సవం, ఏకాంతసేవలు కన్నుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామున సాగిన స్వామివారి అశ్వవాహన సేవలో అశ్వవాహన రూఢులైన ఆలయ పార్వతిజడలరామలింగేశ్వరులు ఆలయ తిరువీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. వసంతోత్సవం, దోపోత్సవం, త్రిశూల స్నానాది కార్యక్రమాలను సైతం కన్నుల పండువగా నిర్వహించారు. రాత్రి పుష్పోత్సవం, ఏకాంత సేవలను వైభవోపేతంగా నిర్వహించారు. శివసత్తులు, భక్తులు భారీగా ఈ ఉత్సవ సేవల్లో పాల్గొన్నారు. ఆదిదంపతుల దర్శనం కోసం బారులు తీరారు. మంగళవారం కావడంతో క్షేత్ర పాలక శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు, ఆంజనేయునికి ఆకు పూజలు, శ్రీ రేణుకా ఎల్లమ్మకు బోనాలు నైవేద్యాది కార్యక్రమాలు నిర్వహించారు.