ఆంధ్రప్రదేశ్‌

మండలి ఎన్నికల్లో అధికార దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: రానున్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన ఎంపిటిసిలు, జడ్పీటిసిలకు నీరు-చెట్టు పథకం కింద పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందని వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ ఎన్నికల అధికారికి ఫిర్యాదును అందజేశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా ప్రభుత్వం కలెక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులను మంజూరు చేయాలని చెబుతోందని తెలిపారు. అలాగే అనైతికంగా ఇతర పార్టీ ల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా నీరు- చెట్టు పథకం కింద నిధులు భారీగా మంజూరు చేస్తామని ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకునే చర్యలకు పాల్పడుతోందని ఆయన ఎన్నికల అధికారి దృష్టికి తెచ్చారు. గతంలో నెల్లూరు జిల్లా లో జరిగిన ఉదంతాన్ని జగన్ ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ అనైతిక చర్యలకు అడ్డుకట్ట వేసి, మండలి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఆయన కోరారు.