తెలంగాణ

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పరిశ్రమల్లో జల, వాయు, నీటి కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై వేటు వేస్తామని రాష్ట్ర పర్యావరణ మంత్రి జోగురామన్న హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్‌పిసిబి) కార్యకలాపాలపై సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. జిల్లాల్లో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలను పునర్వ్యస్థీకరిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పరిశ్రమల్లో కాలుష్యం వెదజల్లని వాటికి తక్షణమే కాలుష్య నియంత్రణ మండలిద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు. కాలం చెల్లిన వాహనాలు నడవకుండా చూడాలని, ఆర్టీసి బస్సులు ఏవైనా ఉంటే సంబంధిత అధికారులే తొలుత చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇంధనంగా వాడకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.