తెలంగాణ

‘కల్వకుర్తి పాపం’ మీదంటే మీది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఫిబ్రవరి 10: కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం బహిరంగ చర్చ జరిగింది. గత కొన్ని రోజులుగా పాలమూరు లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చ జరిపారు. టిఆర్‌ఎస్ తరపున ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి బహిరంగ చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వగా, టిఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేస్తోందని, కొన్ని ప్రాంతాలకు నీళ్లు రాకుం డా చేస్తోందని వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఘనాపురం కెనాల్‌కు 25వేల ఎకరాల సాగుకు నీరు ఇచ్చేందుకు కల్వకుర్తికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ సూపరిటెండెంట్ ఇచ్చిన మెమో ఆధారంగా, ప్రభుత్వంపై కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ మెమో.. మంత్రి లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆమోదించింది కాదని వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం వల్లనే కల్వకుర్తి ప్రాజెక్టు ఆలస్యం అయిందని, దీనికి తెలంగాణ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చూపడం సరికాదని నిరంజన్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఖరీఫ్ సీజన్‌లో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్పారు.