తెలంగాణ

నీలోఫర్ సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: నీలోఫర్ ఆస్పత్రిలో ఒకేసారి ఐదుగురు బాలింతలు మరణించిన సంఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓపై వేటు వేసింది. నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్, ఆర్‌ఎంఓ ఉషారాణిలపై వేటు వేశారు. వీరిద్దరినీ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్‌కు సరెండర్ చేశారు. గురువారం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రిలో ఐదుగు రు బాలింతల మృతిపై స్పందించిన మంత్రి విచారణ కోసం త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ నివేదిక రాకముందే హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో విచారణకు ఆదేశించారు. త్రిసభ్య కమిటీతో పాటు జిల్లా కలెక్టర్ విచారణ జరుపుతారని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్య లు తీసుకుంటామని చెప్పారు. త్రిసభ్య కమి టీ నివేదిక ఇంకా ఇవ్వలేదు. అయితే ప్రాథమికంగా ఆస్పత్రి బాధ్యుల నిర్లక్ష్యం బయట పడడంతో సూపరింటెండెంట్‌ను, ఆర్‌ఎంఓను బదిలీ చేశారు.