తెలంగాణ

పెరుగుతున్న రోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లో శ్వాసకోశ నిపుణులు (పల్మనాలజీ), డయాబెటిక్, కీళ్ల వ్యాధి నిపుణులు (రుమాటిక్స్) వద్ద బాధితుల అపాయింట్‌మెంట్‌లు విపరీతంగా పెరిగాయని హెల్త్‌కేర్ మ్యాప్ ఇండియా రెండవ ఎడిషన్ సర్వే లో వెల్లడయింది. శ్వాసకోశ నిపుణులతో అపాయింట్‌మెంట్లలో 39 శాతం, మధుమేహ నిపుణులతో 38 శాతం, కీళ్ల వ్యాధి నిపుణులతో అపాయింట్‌మెంట్లలో 30 శాతం పెరుగుదల నమోదైంది. వేగంగా నగరీకరణ చెందడం, సామాజికంగా, ఆర్థికంగా వేగవంతమైన అభివృద్ధిని సాధించడం వంటి వాటి వల్ల గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారని ప్రాక్టో సంస్థ పేర్కొంది. వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీని వల్ల పల్మనాలజిస్టులను సందర్శించే వారి సంఖ్య దేశం మొత్తం మీద 62 శాతం పెరింది. ఈ అపాయింట్‌మెంట్లను తీసుకుంటున్న వారిలో ప్రధానంగా 35 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారే అధికంగా ఉంటున్నారు. పల్మనాలజిస్టులను సందర్శించే వారి పెరుగుదల అధికంగా ఉన్న మొదటి మూడు నగరాల్లో ఢిల్లీలో 50 శాతం, ముంబయిలో 64 శాతం, బెంగళూరులో 80 శాతం, హైదరాబాద్‌లో 39 శాతం పెరిగింది. వాతావరణంలో ప్రమాదకరమైన విషవాయువుల కారణంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ (సిపిఓడి), ఇంటెస్టియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డి) వంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని హార్ట్ అండ్ లంగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మిట్టల్ తెలిపారు. శ్వాస తీసుకునే వ్యాయామం చేయడం, ధూమపానం పూర్తిగా మానివేయాలని ఆయన కోరారు. దేశంలో డయాబెటాలజిస్టులను కలిసేవారి సంఖ్య 25 శాతం పెరిగింది. అపాయింట్‌మెంట్ కోరుతున్న వారిలో 70 శాతం మంది 25 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు కావడం విశేషం.
అధిక రక్తపోటుతో సాధారణంగా కార్డియాలజిస్టుల అపాయింట్‌మెంట్‌లు తీసుకుంటున్న వారిలో 40 శాతం పెరుగుదల ఉన్నదని, ఎక్కువ అపాయింట్‌మెంట్‌లను తీసుకున్న వారిలో 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఎక్కువున్నారని బెంగళూరుకు చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జిన్ డాక్టర్ రమేశ్ శేషాద్రి పేర్కొన్నారు. స్పైన్ సర్జన్స్‌లో అపాయింట్‌మెంట్‌లో 31 శాతం పెరుగుదల నమోదైంది. 18 నుంచి 24 ఏళ్ల లోపు వారే ఈ అపాయింట్‌మెంట్లను తీసుకుంటున్నారు. కడుపునొప్పి సంబంధిత వ్యాధులతో బాధపడే వారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల అపాయింట్‌మెంట్‌లలో 22 శాతం పెరుగుదల కనపడుతోందని హెల్త్‌కేర్ మ్యాప్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్‌లో ఈ నిపుణుల వద్ద అపాయింట్‌మెంట్ల పెరుగుదల 24 శాతం వరకు ఉంది.