తెలంగాణ

రెండేళ్లలో ఊహించని అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రెండేళ్లలో తెలంగాణలో ప్రభుత్వం ఊహించని అభివృద్ధి సాధించిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఊహించని మార్పు తీసుకు వచ్చినట్టు తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడుతున్నామని అన్నారు. విదేశాల్లో ఉన్నత చదువు చదువుకునే బిసి విద్యార్థులు 300 మందికి 20లక్షల రూపాయల చొప్పున అందజేసినట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా చేప పిల్లలకు 50శాతం సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని, కానీ రాష్ట్రంలో మొత్తం ఉచితంగా ఇచ్చినట్టు చెప్పారు. వచ్చే సంవత్సరంనుంచి గ్రామ పంచాయతీల ద్వారా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఔట్‌సోర్సింగ్ మినహా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరగలేదని కానీ ఇప్పుడు వేలాది ఉద్యోగాల నియామకాలు జరుపుతున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా లక్షలాది మంది రైతులకు మేలు కలుగుతోందన్నారు. జిల్లాల పునర్విభజన ద్వారా పాలన ప్రజలకు చేరువ అయిందని అన్నారు. గంగపుత్రులకు చేప పిల్లలు అడగక ముందే ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ కోసం, ఎరువులు, విత్తనాల కోసం గత ప్రభుత్వాల హయాంలో రైతులు నిరంతరం ఆందోళనలు చేసే వారని, తెలంగాణ ఏర్పడిన తరువాత అలాంటి ఆందోళనలు అసలే లేవన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందించనున్నట్టు చెప్పారు. కోదండరామ్‌తో పాటు ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకోవచ్చునని, ఎవరేమిటో ప్రజలు ఎన్నికల్లో చెబుతారని ఒక ప్రశ్నకు సమాధానంగా తలసాని చెప్పారు. గొర్రె పిల్లల కొనుగోలుకు ఆరు రాష్ట్రాలకు బృందాలను పంపినట్టు, వారు నివేదిక ఇచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. తాను ప్రజల్లో తిరిగే నాయకుడినని, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినా తానే గెలుస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా తలసాని తెలిపారు.