తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అక్రమాలకు పాల్పడినా, ఓటర్లను ప్రలోభ పెట్టెందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూ డు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ల నియోజక వర్గాలకు, తెలంగాణలో ఖాళీ కానున్న ఒక టీచర్స్ నియోజకవర్గానికి ఈ నెల 13న (సోమవారం) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రలోని తొమ్మిది, తెలంగాణలో మూడు జిల్లాల్లో ప్రవర్తనా నియమా వళి (కోడ్) అమలులోకి వచ్చిందని, కనుక ఓటర్లకు ఎవరైనా మొబైల్స్, ల్యాప్ టాప్స్, చీరలు, ఇతరత్రా వస్తువులు లేదా నగదు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఐపిసి-171 సెక్షన్ ప్రకారం అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న ఆరున్నర లక్షల మంది ఓటర్ల కోసం 833 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, 23న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసి, మార్చి 9న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఆ రోజున ఇంటర్మీడియేట్ పరీక్షలు ఉన్నందున విధుల్లో ఉండే ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, 15న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. సాధారణ ఎన్నికల తరహాలో ఓటింగ్ ఉండదని, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటే 1, 2, 3 ఇలా ఓటు వేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. పోటీ చేసిన అభ్యర్థులందరికీ పైన పేర్కొన్న ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలని ఆయన సూచించారు. ఇదిలావుంటే, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సోమవారం కోర్టుకు నివేదిక అందజేయనున్నట్లు భన్వర్‌లాల్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉపాధ్యాయులు ఎవరైనా ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించు కోవాలనుకుంటే ఈ నెల 20వ తేదీలోగా కస్తూర్బా బాలికల విద్యాలయంలో చేర్పించుకోవాలని అన్నారు.
నియోజకవర్గాల వారీగా
ఓటర్ల వివరాలు ఇవీ..
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యు యేట్ నియోజకవర్గంలో 1,55,094 మంది ఓటర్లు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ నియోజ కవర్గంలో 2,20,554 మంది ఓటర్లు, కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్ నియోజక వర్గంలో 2,50,734 మంది ఓటర్లు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్ల నియోజకవర్గంలో 20,290 మంది ఓటర్లు, కడప, అనంతపురం, కర్నూలు టీచర్ల నియోజకవర్గంలో 20,262 మంది ఓటర్లు. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ టీచర్ల నియోజకవర్గంలో 23,013 మంది ఓటర్లు.