తెలంగాణ

500 మంది బాల కార్మికులకు విముక్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తల్లిదం డ్రుల ముద్దు ముచ్చట్లతో ఆడు తూ.. పాడుతూ.. చదువుకోవాల్సిన చిన్నారులు రాష్ట్ర సరిహ ద్దులు దాటాల్సి వచ్చింది. పిడికెడు మెతుకుల కోసం చిన్నారుల బా ల్యం వెల్డింగ్ షాపులు, వస్త్ర దుకాణాలు, సైకిల్ స్టోర్లు, పరిశ్రమల్లో కరిగిపోతోంది. మోయలేని పనిభారంతో రోజూ నరక యాతన అభవిస్తున్న బాలకార్మికు లు ప్రతి ఏటా పెరిగిపోతున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసు లు సంయుక్తంగా నిర్వహించిన ఆపరే షన్ ‘స్మైల్’లో సుమారు 500 మంది బాలకార్మికులకు ఈ త్రైమాసికంలో వి ముక్తి లభించింది. హైదరాబాద్‌లో పిల్లల సంరక్షణ కోసం 2015 జనవరి ఒకటిన ఆపరేషన్ ‘స్మైల్’ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌లో పలువురు చిన్నారులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చగా, మరి కొందరిని అధికారులు రెస్క్యూ హోంకు తరలించారు. పోలీస్ వ్యూహం, అధికా రుల ఆకస్మిక తనిఖీలు ఫలించడంతో బాలకార్మికులకు స్వేచ్ఛ లభిస్తోంది. రెండు నెలల పాటు జరిగిన ఈ తనిఖీ లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిం చారు. కలెక్టర్ మార్గదర్శకాలతో ఆపరేష న్ ‘స్మైల్’ కొనసాగుతోంది. దీనికి కన్వీ నర్‌గా మహిళాశిశు సంక్షే మ శాఖాధికారి కుసుమకుమారి వ్యవహరిస్తున్నారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో టీమ్ చొప్పున మొత్తం 18 యాక్షన్ టీమ్‌లను రంగంలో కి దింపి నగరాన్ని జల్లెడ పట్టారు. ఒక్కో టీమ్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఎస్సై, 8 మంది కానిస్టేబుళ్లు, వీరిలో ముగ్గురు కానిస్టేబు ళ్లు, పలువురు ఎన్జీవో సభ్యులు ఉన్నారు. వీరి వ్యూహం ఫలించడంతో గత మూడు నెలల్లోనే దాదాపు ఐదు వందల మంది బాలకార్మికులకు విముక్తి లభించింది. వీరిలో అత్యధికులు ఉత్తరా ది రాష్ట్రాలు బీహార్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారున్నారు. గతంలో నిర్వహించిన రెండు ఆపరే షన్లలో 736 మంది చిన్నారులకు విముక్తి కలిగింది. అందులో 265 మంది చిన్నారు లు ఉత్తరప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుత ఆపరేషన్‌లో విముక్తి పొందిన దాదాపు 500 మంది చిన్నారుల్లో 280 మందిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. మరో 220 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగిం చారు. వీరిలో నలుగురు బాలికలు కూడా ఉన్నారు.
స్మైల్ ఆపరేషన్‌లో పట్టుబడిన వారం తా 6 నుంచి 14 ఏళ్ల వయసు లోపువారే. వీరంతా నగరంలోని వివిధ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు, వెల్డింగ్ షాపులు, సైకిల్ షాపులు, గాజుల తయారీ పరిశ్రమలు, వస్త్ర దుకాణాలు, టీ కొట్లలో పనిచేస్తున్నారు. ఇదిలా వుండగా ఆర్థిక స్తోమత లేని వారి తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ నిర్వహించి పాఠశాలలకు పంపే విధంగా అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు.