తెలంగాణ

బజాజ్ కమిటీతో నేడే చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల నిర్వాహణ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బజాజ్ కమిటీ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది.
ఐదుగురు సభ్యులు గల ఈ కమిటీ ఉభయ రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహిస్తుంది. 13న ఉదయం 11గంటలకు తెలంగాణ అధికారులతో జల సౌధలో సమావేశం అవుతుంది. 14న ఉదయం ఏడుగంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటుంది. ఉదయం పదకొండు గంటలకు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అవుతుంది. బజాజ్ కమిటీ తిరిగి 15న విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. 15న ఉదయం 11 గంటలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. అదే రోజురాత్రి న్యూఢిల్లీ వెళ్తుంది. కృష్ణా జలాల పంపిణీ ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. రెండు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో కేంద్రం సమస్య పరిష్కారానికి బజాజ్ కమిటీని నియమించింది. జలాల పంపిణీపై పగడ్బందీ ఏర్పాట్ల కోసం ఈ కమిటీ సూచనలు చేస్తుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యా యంగా దక్కాల్సిన వాటాపై రాజీ పడేది లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రకటించింది. మంత్రి హరీశ్‌రావు పలు సమావేశాలు నిర్వహించారు. బజాజ్ కమిటీ ముందు తమ వాదన వినిపించేందుకు అధికారులు ఒక నివేదిక రూపొందించారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ సైతం తన వాదన వినిపించేందుకు నివేదిక రూపొందించింది. ఒకవైపు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పంపిణీపై వివాదం సాగుతుండగా, మరోవైపు కర్నాటక ప్రభుత్వం ప్రాజెక్టుల ఎత్తు పెంచడం రెండు రాష్ట్రాలకు ఇబ్బంది కరమే అని అధికారులు చెబుతున్నారు.