తెలంగాణ

ఇంజనీరింగ్‌లో 22శాతమే ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఇంజనీరింగ్ విద్యార్థుల ఉత్తీర్ణత రోజురోజుకూ తగ్గి 22 శాతానికి పడిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లుగా తెలంగాణ పరిధిలో లక్షన్నర మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. అయితే వీరిలో 20వేల మందికి మించి ఉత్తీర్ణులు కావడం లేదని ఇటీవలి లెక్కలు తేలుస్తున్నాయి. దీనికి జెఎన్‌టియు అమలు చేస్తున్న మూల్యాంకన పద్ధతులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించాలని, పరీక్షా మూల్యాంకనంలో చేయాల్సిన మార్పులపై విసి విద్యార్థులతో చర్చించాలనే డిమాండ్ వస్తోంది. ఈ అంశంపై అఖిల భారత విద్యార్థి పరిషత్ నేతలు సైతం విసిని కలిసి ఒక వినతి పత్రం అందించారు. ఈ ఫలితాలను ఇప్పటికైనా విసి సమీక్షించాలని కోరుతూ ఎబివిపి రెక్టార్ ప్రొఫెసర్ ఎన్‌వి రమణారావుకు ఒక వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి జవ్వాజి దిలీప్ మాట్లాడుతూ వేలాది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నా యూనివర్శిటీకి పట్టింపు లేకపోవడం దారుణమని పేర్కొన్నారు.