తెలంగాణ

రాష్టప్రతి పేరును ఎందుకు చేర్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పలు వివాదాలకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావును తొలగించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత , రాజ్యసభ్య సభ్యుడు వి హనుమంతరావు హైకోర్టులో ప్రజావాజ్య పిటీషన్‌ను దాఖలు చేశారు.
ఒక క్రిమినల్ కేసులో వైస్ ఛాన్సలర్ నిందితుడిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద దాఖలైన కేసులో విసి పేరు ఉందని తెలిసి కూడా కేంద్రం ఆయనను తిరిగి విధుల్లో కొనసాగిస్తోందని ఈ పిటిషన్‌లో వివరించారు. జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన బెంచి ఈ పిటిషన్‌ను విచారించింది.
పిటిషన్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పేరును కూడా ఎందుకు చేర్చారని కౌన్సిల్ దామోదర్‌రెడ్డిని ధర్మాసనం నిలదీసింది. సెంట్రల్ యూనివర్శిటీల చట్టం 2009 కింద యూనివర్శిటీపై పూర్తి అదుపు రాష్టప్రతికి మాత్రమే ఉందని, విసిని నియమించింది రాష్టప్రతి కనుక ఆయన పేరు కూడా చేర్చామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అభియోగానికి తగ్గట్టు వచ్చే సోమవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఎందుకు వసూలు చేస్తున్నారు?
కాంట్రాక్టు కంపెనీల నుండి 0.25 శాతం మేర సెస్ వసూలు చేయవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు వసూలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు నిలదీసింది. పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎ శేషసాయి ఈ ఉత్తర్వులు ఇచ్చారు. మార్చి 7లోగా ఈ అంశానికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు.