తెలంగాణ

ఇక్రిసాట్ సహకారంతో వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటాన్‌చెరు, ఫిబ్రవరి 13: అన్నదాతలు ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని ఐటి శాఖ మంత్రి తారకరామారావు పిలుపునిచ్చారు. మన దేశంలో అత్యధిక సంఖ్యాకులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నప్పటికీ ఇతర దేశాల మాదిరిగా వృద్ధిని నమోదు చేయడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు పట్టణ శివారులోని మెట్ట పంటల పరిశోధన కేంద్రం ఇక్రిసాట్‌లో సోమవారం ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కిలిసి ఐ హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ వ్యవసాయదారులకు అవసరమైన ఆర్థిక సహకారమే కాకుండా అన్ని రకాల సేవలు అందించడానికి ఇన్నోవేషన్ హబ్ (ఐ హబ్)ను ప్రారంభించడం జరిగిందన్నారు.
చిన్న, సన్నకారు రైతన్నలను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అన్నదాతల సంక్షేమాన్ని ఆశించి ఇక్రిసాట్ సంస్థలో ప్రారంభించిన ఐ హబ్ అతి ముఖ్యమైనదిగా మంత్రి కెటిఆర్ అభివర్ణించారు. దాదాపు 70 శాతం ప్రజలు ఇండియాలో వ్యవసాయరంగంలో ఉన్నారని, వారి ఆదాయం పెరగడానికి ఐ హబ్ లాంటివి అవసరమని ఆయన తేల్చిచెప్పారు. వ్యవసాయరంగంలో రైతన్నల పెట్టుబడులు పెరగాలని, దానితో దిగుబడులు మరింత పెరగాలని మంత్రి కెటిఆర్ ఆకాంక్షించారు. దీనితో ప్రతి సంవత్సరము అన్నదాతలు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం తగుతుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. వ్యవసాయానికి అవసరమైన నీటిని అందించడం తద్వారా అధిక దిగుబడులు సాధించడమే కాకుండా అన్నదాతలలో ఆత్మస్థైయిరాన్ని పెంపొందించడం జరుగుతుందని మంత్రి పోచారం స్పష్టం చేసారు. అవసరమైన సలహాలు, సహకారం అందించడానికి ఐ హబ్ ద్వారా సాధ్యపడుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కేవలం వ్యవసాయంపైనే ఆధారపడిన మారుమూల గ్రామాల ప్రజలకు సైతం మంచి రోజులు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక రకాల నూతన పధకాలకు ఆవిష్కరణ చేయడం, వాటి ద్వారా ఆర్థికంగా అన్నదాతలు మంచి అభ్యున్నతిని సాధించడం జరిగిందన్నారు.

చిత్రం..పటాన్‌చెరులోని ఇక్రిసాట్‌లో సోమవారం ఐ హబ్‌ను
ప్రారంభిస్తున్న మంత్రి కెటిఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి