తెలంగాణ

కాల్పులు పేరిట పాలకుల బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టేందుకు ప్రయత్నిస్తుంటే పాలకులు కాల్పుల పేరిట ప్రజలను భయాందోళనలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. తుపాకీ కాల్పులకు భయపడే సంస్కృతి తెలంగాణలో చిన్నపిల్లవాడికి కూడా లేదని, అలా భయపడే పరిస్థితే ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. ఈనెల 22న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగుల నిరసన ర్యాలీకి మద్దతు కూడ గట్టేందుకు కెయు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ హ్యుమానిటీస్ బిల్డింగ్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రం లో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తే, ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు కాల్పుల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 2014 ఎన్నికల అనంతరం అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశంలో 1.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించారని, ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మరో 30 వేలమంది ఉద్యోగాలు పదవీ విరమణ పొందారని చెప్పారు. దీనినిబట్టి రాష్ట్రంలో 1.52 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం 15 వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసిందని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపట్ల తెలంగాణ పౌరసమాజంలోని నిరసన తెలపటానికి ఈనెల 22న హైదరాబాద్‌లో ‘మా కొలువులు మాకు కావాలి’ అనే నినాదంతో నిరసన ర్యాలీని చేపడుతున్నామని చెప్పారు.