తెలంగాణ

దటీజ్ కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రెండు తరాలు పోరాటం చేసి అలసిపోయి నిరాశ నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజానికి విశ్వాసం కలిగించిన వ్యక్తి కెసిఆర్ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యమపార్టీ అయినప్పటికీ పాలనలో పట్టు సాధించి కెసిఆర్ చతురత, నైపుణ్యంతో విజయం సాధించారని అన్నారు. దీంతో దేశానికే పోరాట స్ఫూర్తిని నేర్పిన నేల తెలంగాణ అని ఈటెల పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో త్రినేత్ర రచించిన ‘దట్ ఈజ్ కెసిఆర్’ పుస్తకాన్ని మంత్రి ఈటెల ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బిసి కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ ముద్రించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలను కెసిఆర్ ఏ విధంగా ఉద్యమ వ్యాప్తికి ఉపయోగించారో త్రివిక్రమ్ ఈ పుస్తకంలో పొందుపర్చారని మంత్రి అన్నారు. కెసిఆర్‌ను విమర్శించే వ్యక్తులు, నచ్చని వారు ఉన్నా తెలంగాణ సాధించే విషయంలో కెసిఆర్ కమిట్‌మెంట్‌ను ఎవరూ శంఖించలేదని అందుకే ఆయన దట్ ఈజ్ కెసిఆర్ అని అన్నారు. దేశ పటంపై తెలంగాణ ముద్ర వేసిన వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు. మీకు పరిపాలించుకునే సత్తా ఉందా అని ప్రశ్నించిన వారికి తన సత్తా చూపారని, తెలంగాణ ఏర్పడనప్పుడు మంత్రులుగా మాకు గౌరవం ఉండేది కాదని, కానీ ఈ రోజు పిలిచి కూర్చోబెడుతున్నారని అన్నారు.