తెలంగాణ

ప్రయాణికులకు మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ప్రయాణికుల ఆదరణకు మెరుగైన సేవలే తార్కాణమని, ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం జోనల్ ట్రాన్స్‌పోర్ట్ అకాడమిలో మూడురోజుల పాటు జరిగిన డిపో మేనేజర్ల పునశ్చరణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రయాణికుల నమ్మకాన్ని కోల్పోకుండా సమయపాలన పాటించాలని, సమయానికి బస్సులు నడపడం చాలా అవసరమన్నారు. డిపోనుంచి బయలుదేరే బస్సులు పూర్తిగా శుభ్రంగా ఉండాలని, బస్సుల వేళలు, వారికి కల్పించే సౌకర్యాలు, సేవల వివరాలు పూర్తిగా తెలిసేలా చేయగలినప్పుడే ప్రయాణికులు ఆర్టీసిని ఆదరిస్తారన్నారు. తెలంగాణలో దాదాపు 1200 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉందని, ఈ మేరకు రహదారి మార్గాలున్న గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి అధికారులకు ఆదేశించామని చైర్మన్ తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో ట్రైనింగ్ అకాడమీ ప్రిన్సిపాల్ జిఆర్ కిరణ్, అధికారులు రాజశేఖర్, అంజయ్య, శైలశ్రీ, గిరి, శ్రీనివాస్, శశిరేఖ, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.