తెలంగాణ

నకిలీ ట్రావెల్ ఏజెంట్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఓ నకిలీ ట్రావెల్ ఏజెంట్‌ను సైబర్ క్రైమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకు చెందిన కుమార్ అర్ముగం అలియాస్ అరుణ్‌కుమార్ ఆన్‌లైన్ వీసా, ఎయిర్ టికెట్ల పేరుతో మోసానికి పాల్పడుతున్నాడు. అరుణ్‌కుమార్ చేతిలో మోసపోయిన హబ్సిగూడ విద్యార్థి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్స్ పోలీసులు చెన్నైలోని ఈరోడ్‌లో నిందితుణ్ని అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం గురువారం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. చెన్నైకు చెందిన అరుణ్‌కుమార్ ‘కాస్మోస్ టూర్స్ అండ్ ట్రావెల్స్’మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో హబ్సిగూడకు చెందిన జె తులసిరాం, తన వదిన విదేశాలకు వెళ్లాల్సి ఉండగా అరుణ్‌కుమార్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. వీసా, టికెట్ల నిమిత్తం రూ. 60వేలు, డాక్యుమెంట్లను అరుణ్‌కుమార్‌కు కొరియర్ ద్వారా పంపించారు. అయితే సింగిల్ వీసా సాధ్యపడదని, కనీసం 10 మందితో కూడిన గ్రూప్ వీసా తేలికగా సాధ్యపడుతుందని, ఒక్కొక్కరికి రూ. లక్షా 25వేలు అవుతుందని అరుణ్‌కుమార్ తెలిపాడు. దీంతో వీరు కొంతమంది విద్యార్థులను కలుపుకొని రూ. 10,65,000లను అరుణ్‌కుమార్‌కు చెందిన యాక్సిస్ బ్యాంక్‌లో జమ చేశారు. అతనువారికి వీసాలు, టికెట్లు పంపించాడు. గత సంవత్సరం జూలై 29న విద్యార్థులు తమకు అందిన వీసా, ఎయిర్ టికెట్లను తీసుకుని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ డాక్యుమెంట్లు పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు నకిలీ వీసా, ఎయిర్ టికెట్లుగా తేల్చేశారు. దీంతో తాము మోసపోయామంటూ ఏజెంట్ అరుణ్‌కుమార్‌కు ఫోన్ చేయగా, అతని ఫోన్ స్విచాఫ్ ఉంది. దీంతో బాధితులు సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెన్నై వెళ్లి అరుణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్టు తెలిపారు.