తెలంగాణ

అర్థంపర్థం లేని మూల్యాంకనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: అతితక్కువ శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారనే ఆరోపణలతో హైదరాబాద్ జెఎన్‌టియు అట్టుడికి పోతుండగా, మరోపక్క వాల్యుయేషన్‌లో లోపాలను బట్టబయలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో అనేక ఆధారాలు వస్తున్నాయి. గుంటూరు ఎన్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంటర్నల్స్‌లో ఒక విద్యార్థి ఇటీవల చిరంజీవి నటించిన ఖైదీ-150 సినిమాలోని ‘రత్తాలు..రత్తాలు’ అనే పాట రాసినా పేపర్‌ను దిద్దిన లెక్చరర్ రెండు మార్కులు కేటాయించడం పెద్ద చర్చనీయాంశం అయింది. జవాబుపత్రాలను ఇలా దిద్దుతుంటే బాగా రాసిన విద్యార్థుల భవితవ్యం ఇంకెలా ఉంటుందో అని వారు నిలదీస్తున్నారు. పేపర్లు దిద్దేవారు కనీసం మొత్తం చదవకుండా ఒక వాక్యం చదివి మార్కులు వేస్తున్నారని, దీనివల్ల తెలివైన విద్యార్థులకు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని వారు చెబుతున్నారు. కాగా కావాలనే సామాజిక మాధ్యమాల్లో సంచలనం కోసం దానిని ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని కాలేజి యాజమాన్యం చెబుతోంది.