తెలంగాణ

పోలీసులమని బెదిరించి వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం, ఫిబ్రవరి 16: పోలీసులమని వాహనదారులను భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను ఎల్‌బినగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్‌బినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దేశ్‌ముఖి గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న తేరాల భార్గవ్ (20), గుంతపల్లి గ్రామంలో ఉన్న అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న నెలవెల్లి గోపినాధ్ (20), ఘట్‌కేసర్‌లోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న అనుంతుల శివ (21) ఎల్‌బినగర్‌లోని చింతల్‌కుంటలో ఒకేచోట నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురూ కలసి చింతల్‌కుంట చౌరస్తా వద్ద రోడ్డుపై వెళుతున్న వాహనాలను ఆపి తాము పోలీసులమని లైసెన్స్, ఆర్‌సి బుక్కు లు చూపించాలని బెదిరించి, అవి లేనివారి వద్ద డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. ఇది గమనించిన ఒక వ్యక్తికి అనుమానం వచ్చి వెంటనే ఎల్‌బినగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిఘా ఏర్పాటుచేసి గురువారం తెల్లవారు జామున చింతల్ కుంటలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు పోలీసుల వద్ద అంగీరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు కాశిరెడ్డి తెలిపారు.

చిత్రం..పోలీసుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న
ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేసి విలేఖరులకు చూపిస్తున్న ఎల్బీనగర్ పోలీసులు