తెలంగాణ

తప్పతాగి పోలీసుల వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఫిబ్రవరి 16: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తహశీల్ కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి ఒక కానిస్టేబుల్, హోంగార్డు తప్పతాగి వీరంగం సృష్టించి దాడికి పాల్పడడంతో విఆర్‌ఎలకు గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొల్లమల్ల, మెదేపల్లి గ్రామాలకు చెందిన విఆర్‌ఎలు రంగన్న, చంద్రన్న, కురుమన్న బుధవారం రాత్రి తహశీల్ కార్యాలయంలో రాత్రి పూట విధులు నిర్వహిస్తూ నిద్రకు ఉపక్రమించారు. 11 గంటల సమయంలో 729 నెంబర్‌గల హోంగార్డు, 1080 నెంబర్‌గల కానిస్టేబుల్ తహశీల్ కార్యాలయంలోకి వచ్చి తాగిన మైకంలో తీవ్రంగా దాడి చేశారు. దాడిలో రంగన్నకు గాయాలు కావడంతో తోటి విఆర్‌ఎలు కాళ్ల్లావేలాపడి బతిమాలడంతో వదిలి పెట్టినట్లు బాధితుడు వాపోయారు. కాగా, ఎలాంటి కారణం లేకుండానే విఆర్‌ఎలపై దాడి చేసి గాయపరిచిన కానిస్టేబుల్‌ను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ గురువారం తహశీల్ కార్యాలయం ముందు విఆర్‌ఎలు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందు మాట్లాడుతూ రాత్రీపగలు అని తేడా లేకుండా ప్రజలకు సేవలందిస్తున్న విఆర్‌ఎలపై దారుణంగా దాడి చేసి గాయపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ గోవిందుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎలు హనుమంతు, వెంకటన్న, మునిందర్, ఆశన్న, రాములు తదితరులు పాల్గొన్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ సిహెచ్ రాజు తెలిపారు.