తెలంగాణ

అనుమతులు వచ్చాకే కాలువల పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పాలమూరు- రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పనులు, టెండర్ ప్రక్రియకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (దక్షిణ భారత విభాగం) స్టే ఇచ్చినట్టు పిటిషనర్ ఆరోపించగా అదంతా అబద్ధమని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. స్టేపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా ఇంతవరకు తాము తాగునీటి అవసరాలు తీర్చే పనులే చేపట్టామని, వీటికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని, సాగునీటికి సంబంధించిన పనులను మాత్రం పర్యావరణ అనుమతులు వచ్చాకే చేపడతామని స్పష్టం చేసింది. అయితే ట్రిబ్యునల్ ఎలాంటి స్టే ఇవ్వలేదని, స్టే ఇచ్చినట్టు పిటిషనర్ చెప్పిన ప్రచారాన్ని నీటిపారుదల శాఖ ఖండించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ నంబియార్, పిఎస్ రావులతో కూడిన బెంచ్ విచారించింది.
ఇదీ పిటిషనర్ వాదన
పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని బీరమ్ హర్షవర్దన్ రెడ్డి ఆరోపిస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అమ్రాబాద్- శ్రీశైలం- నాగార్జున సాగర్ గుండా సాగే నిర్మాణ పనులను రిజర్వ్ ఫారెస్ట్ అనుమతి తీసుకోకుండానే చేపట్టారని ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. 279 హెక్టార్ల అటవీ భూముల్లో పనులు చేపడుతున్నా అటవీ, పర్యావరణ అనుమతి తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పిటిషనర్ తరపున వాదించిన సంజయ్ ఉపాధ్యాయ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వాటర్ ప్రాజెక్టుగా చెబుతూ ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు చేసేస్తున్నారని అన్నారు. ఎనిమిది నెలల క్రితం ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారని, టైగర్ రిజర్వ్ ఫారెస్టులో అక్రమంగా పేలుళ్లు నిర్వహిస్తున్నారని అన్నారు.
ఇదీ ప్రభుత్వం వాదన
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరన్ వాదించారు. మొదటి విడత తాగునీటి కోసం ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని, తాగునీటి ప్రాజెక్టు కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం లేదని వాదించారు. మొదటి దశలో తాగునీటిని, రెండవ దశలో సాగునీటిని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఎన్‌జిటికి వివరించింది. సాగునీటి సరఫరా జరిపే నాటికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి పొందుతామని చెప్పింది. పర్యావరణ అనుమతి వచ్చిన తరువాతనే కాలువల నిర్మాణం చేపడతామని ఎన్‌జిటికి తెలిపింది. ఈ వాదనలకు సమ్మితించిన ఎన్‌జిటి తదుపరి వాదనలు వినడానికి మార్చి 15వ తేదీకి విచారణ వాయిదా వేసినట్టు చీఫ్ ఇంజనీర్ లింగరాజు తెలిపారు. పనులను కొనసాగించడానికి ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పారు. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరన్, తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. సాగునీటి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కె జోషి విచారణకు హాజరై సమన్వయం చేశారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా 1131 గ్రామాలకు తాగునీటిని అందించనున్నట్టు ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు తెలిపింది. 60 రోజుల్లో కృష్ణా నది ద్వారా 120 టిఎంసిల నీటిని ఉపయోగించుకుని తాగునీటిని అందించనున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న బెంచ్ కేసును మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది. కాగా పాలమూరు పనులపై స్టే ఇచ్చారంటూ వచ్చిన వార్తలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత దామోదర రాజనరసింహ ఓ ప్రకటన విడుదల చేశారు.