తెలంగాణ

ఘనంగా కెసిఆర్ జన్మదినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17:ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 63వ జన్మదినాన్ని రాష్టవ్య్రాప్తంగా టిఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో కెసిఆర్ అభిమాన సంఘం జన్మదిన వేడుకలు నిర్వహించడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం ఫోన్ చేసిన ప్రధాని మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. ప్రధానికి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు, ఇతర ప్రముఖలు కెసిఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. వేదపండితులు ఆశీర్వాదం పలికారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. కెసిఆర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ పి హిందుజా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎంపి కవిత, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రులు కెటిఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివిధ ప్రాంతాల్లో జరిగిన కెసిఆర్ జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ భవన్‌లో పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలను నిర్వహించారు. రక్తదాన శిబిరం నిర్వహించారు.కెసిఆర్ లాంటి ప్రజానాయకుడికి కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చైనా పర్యటనలో ఉన్న మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి అక్కడ కెసిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జలవిహార్‌లో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజయ్య యాదవ్‌లు వంద కేజీల కేక్ కట్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప నేత కెసిఆర్ అని హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. కోటి ఎకరాలకు నీటిని అందించడమే కెసిఆర్ లక్ష్యం అని అన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశగా తెరాసా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్‌ను అలింగనం చేసుకునిన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ