తెలంగాణ

వంశీరెడ్డికి కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 17: అమెరికాలో అగంతకుల చేతిలో దారుణ హత్యకు గురైన వంశీరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల కన్నీటి వీడ్కోలు మధ్య జరిగాయి. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు ఏడాదిన్నర కిందట వెళ్లిన వంశీరెడ్డిని గత శనివారం ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వద్ద గుర్తుతెలియని అగంతకుడు కారును దొంగలించే ప్రయత్నంలో తుపాకితో కాల్పులు జరపటంతో వంశీరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని నాలుగు రోజుల తరువాత అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం తదితర కార్యక్రమాలు పూర్తిచేసిన అక్కడి పోలీసులు రెండురోజుల కిందట వంశీ మృతదేహాన్ని ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులకు అందచేసారు. వారు అక్కడినుంచి వంశీ మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు పంపించారు. శుక్రవారం ఉదయం వంశీ మృతదేహం శంషాబాద్ విమానశ్రయానికి చేరుకోగా బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతర ఎయిర్‌పోర్టు అధికారులు అప్పగించిన వంశీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనంలో వరంగల్ నగర శివారులోని వంగపాడుకు తరలించారు. వంశీ మృతదేహాన్ని చూడటంతోనే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపించారు. చేతికి అందివచ్చిన వంశీ దారుణ మరణానికి గురికావటంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేసారు. మధ్యాహ్నం మూడుగంటల సమయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపి జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు అశోక్‌రెడ్డి, రావు పద్మ తదితరులు వంగపాడు వెళ్లి వంశీరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వంశీరెడ్డి మృతదేహంపై పూలమాలవేసి నివాళులు అర్పించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి అశోక్, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు తదితరులు వంగపాడు వెళ్లి వంశీ మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సాయంత్రం కుటుంబ సభ్యుల, బంధువుల, మిత్రుల, గ్రామస్తుల కన్నీటి వీడ్కోలు మధ్య వంశీరెడ్డి అంత్యక్రియలు జరిగాయి.
అమెరికాలోని భారతీయుల రక్షణకు
ట్రంప్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి
అమెరికాలోని భారతీయ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గతంలో అగంతకుల చేతిలో చాలామంది భారతీయ పౌరులు అకాలమరణం చెందారని చెబుతు, భారతీయ ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని నరేంద్రమోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకువస్తుందని చెప్పారు. హంతకుడిపై కఠినచర్యలు తీసుకునేలా, వంశీరెడ్డి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మృతుడు వంశీరెడ్డి తండ్రి సంజీవరెడ్డి మాట్లాడుతు చదువుల కోసం, ఉద్యోగం కోసం దూర దేశాలకు వెళ్లిన వంశీరెడ్డి వంటి ఎందరో పిల్లలను అగంతకులు అకారణంగా కాల్చిచంపుతున్నారని, తమ వంటి ఎందరో తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారని విలపించారు.

చిత్రం..పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ