తెలంగాణ

వరాల కలనేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: చేనేత కార్మికులను బతికించుకోవడమే లక్ష్యంగా వారి సంక్షేమానికి ప్యాకేజీ ప్రకటించేందుకు సిఎం కెసిఆర్ కసరత్తు సాగిస్తున్నారు. ఇప్పటికే పలు ధపాలుగా అధికారులతో చర్చలు జరిపిన కెసిఆర్, జనహితలో ఆదివారం వివిధ జిల్లాలకు చెందిన చేనేత కార్మికులు, ఆసామి, షావుకార్లతో భేటీ కానున్నారు. చేనేత రంగానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించాలని చూసినా పెద్దలకే ప్రయోజనం కలుగుతుంది. నేతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు. అలా కాకుండా నేరుగా చేనేత కార్మికుడికే ప్రయోజనం కలిగేలా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించాలని సిఎం అధికారులను కోరారు. ఆదివారం కొద్దిమంది చేనేత రంగానికి చెందిన వారి అభిప్రాయాలను తెలుసుకోన్నారు. యార్న్‌కు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 20శాతం, కేంద్రం 10 శాతం మొత్తం 30 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. దీన్ని 50 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే రంగుల్లో సైతం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. పట్టు చీరలు నేసే చేనేత కార్మికుల పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ముతక బట్టలు నేసే చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 15వేల మంది ముతక బట్టలు నేసే వృత్తిలో ఉన్నారు. ప్రధానంగా వీరే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సగటున ఒక్కో కార్మికుడు 10 గంటల పాటు పని చేస్తే నెలకు ఆరువేల వేతనం చెల్లిస్తున్నారు. కనీస వేతనం కన్నా ఇది తక్కువ. ఇదే సమయంలో ముతక బట్టలు నేయించే ఆసామి, షావుకార్లకు సైతం పెద్దగా ఆదాయం ఉండదని అధికారులు అంటున్నారు. చేనేత వృత్తిపై ఆధారపడిన వారిపై సమగ్ర సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు. చాలామంది వృత్తి మారిపోయారు. ఇలా ఇతర వృత్తుల్లోకి మారిపోయే వారికి శిక్షణ, ఆర్థిక సాయం అందించే ప్యాకేజీని ప్రకటించే అవకాశముంది. ప్రభుత్వం ఎంత సాయం అందించినా కార్మికుని వేతనాలను పెంచే పరిస్థితి లేదని, దీనికి ఏం చేయాలో సూచించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్ కోసం యూనిఫామ్‌లు వీరి నుంచే కొనుగోలు చేస్తున్నారు. 11వేల రూపాయల వేతనం చెల్లిస్తేనే బట్టలు కొనుగోలు చేస్తామని ముందే ఒప్పందం చేసుకుని దానిని అమలు చేస్తున్నట్టు, ఆ విధంగా కోటి మీటర్లకు పైగా బట్టలు కొనుగోలు చేసినట్టు చేనేత అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి వాళ్ల బాధ తెలుసు, వాళ్లకు ఏదైనా చేద్దాం, మీ పిల్లలకు ఆ పుణ్యం వస్తుంది వాళ్ల దీవెనలు ఉంటాయి. వాళ్లు ఆత్మహత్య చేసుకోవద్దు బతికి ఉండాలి, బతికించుకుందాం ’’అంటూ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శైలజా రామయ్యర్‌తో ముఖ్యమంత్రి చెప్పడం అధికారులను కదిలించింది. ఒక్కో చేనేత కార్మికునికి నెలకు కొంత మొత్తం ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలించారు. నేత కార్మికుని వేతనంలో 8శాతం బ్యాంకులో డిపాజిట్ చేస్తే అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేసే పథకం పరిశీలిస్తున్నారు. హ్లాండ్లూమ్, పవర్ లూమ్ కార్మికుల స్థితిగతులు, వారి సంక్షేమం కోసం తీసుకోవలసిన చర్యలపై కెసిఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా చర్చించారు. చేనేత మగ్గాలు, విద్యుత్ మగ్గాల మీద ఆధారపడి బతుకుతున్న నేత కార్మికుల స్థితిగతులేమీ బాగాలేవని బతకడం కూడా కష్టమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికులతో ఆదివారం మరోసారి సమావేశం కానున్నారు. నేత కార్మికులను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. రాష్ట్రంలో చేనేత మగ్గాలపై పని చేస్తున్న వారి కోసం, విద్యుత్ మగ్గాలపై పని చేస్తున్న వారి కోసం ఏం చేయాలి, వారి ఆర్థిక స్థితి మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నేత పరిశ్రమ లాభసాటిగా మారడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వాలనే అంశంపై ఆదివారం నాటి సమావేశంలో ముఖ్యమంత్రి నేత కార్మికుల అభిప్రాయాలు తెలుసుకుంటారు. శనివారం నాటి సమావేశంలో మంథ్రులు కె తారక రామారావు, టి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, శాంతకుమారి, రామకృష్ణారావు, శైలజా రామయ్యర్, రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ రవీందర్‌రావు, చేనేత సంఘాల నాయకులు జల్ల మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.