తెలంగాణ

కేంద్రంనుంచి ప్రతిపైసా రాబట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతిపైసాను రాబట్టాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి లేఖ రాయాలని అన్నారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో రాబోయే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర పథకాలను సమగ్రంగా అమలు చేయాలని, అందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెచ్చుకుందామని అన్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న కార్పొరేషన్ల పనితీరు మెరుగుపడకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టర్లను అధికారులు సంప్రదించి ప్రతిచోట మహిళా శిశు సంక్షేమ పథకాలను అమయ్యేటట్లు చూడాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో కూడా అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అంగన్‌వాడీ భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణాలపైనా దృష్టి సారించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. మహిళల రక్షణ విషయంలో తెలంగాణ సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. బాల్యవివాహాలను అరికట్టేందుకు కమిటీలు లేనిచోట కమిటీలు వేయాలని అన్నారు.

శనివారం సచివాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు