తెలంగాణ

అక్కడ మల్లన్న..ఇక్కడ శివన్న..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు అడ్డంకులుగా మారుతున్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ తరహాలోనే నల్లగొండ జిల్లా పరిధిలో డిండి ఎత్తిపోతల పథకం పరిధిలోని శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులకు నిర్వాసితులు అడ్డుపడి నెల రోజుల నుండి ప్రాజె క్టు పనులను ఆపివేయించడం వివాదస్పదంగా మారింది. 123 జీవో రద్ధయినందునా కొత్త జీవో 38పై స్పష్టత వచ్చేదాకా పనులు సాగనివ్వబోమని, మల్లన్నసాగర్ నిర్వాసితులకు మాదిరిగానే తమకు పరిహారం, పునరావాసం అందించాలని రైతులు పనులకు అడ్డుపడుతున్నారు. 6,200 కోట్లతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి 2015 జూన్ 12న సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేసి రెండేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతలలో శివన్నగూడెం, కిష్టరాంపల్లి, సింగరాజుపల్లి, చింతపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్లను నిర్మించాల్సివుంది. ముందుగా 1198 కోట్లతో చేపట్టిన శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణానికి 6 కిలోమీటర్ల పొడవు కట్టను నిర్మించడంలో భాగంగా 3.5 కిలోమీటర్ల పొడవు కరకట్టను నిర్మించే పనులను ప్రారంభించారు. రిజర్వాయర్ ముంపు బాధిత రైతులు తమకు పరిహారం చెల్లింపు, పునరావాసం కల్పించాకే పనులు జరిపించాలంటూ జెసిబిలను, టిప్పర్లను అడ్డుకున్నారు. 38 జీవో వచ్చేదాకా పనులను కొనసాగించేందుకు సహకరించాలంటూ అధికారులు చేసిన అభ్యర్ధనలను రైతులు తిరస్కరించి జెసిబిలకు అడ్డుపడడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపివేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి 3,311 ఎకరాల భూసేకరణ చేయాల్సివుండగా ప్రభుత్వ భూములు పోగా 2,892 ఎకరాల భూములను రైతుల నుండి సేకరించే లక్ష్యానికిగాను 123 జీవో కింద 1142 ఎకరాల సేకరణ చేసి రైతుల నుండి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి 49.11 కోట్ల పరిహారం అందించారు. రిజర్వాయర్ పనులను కొనసాగించేందుకు సహకరించాలంటూ ఇప్పటికే జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి నెల రోజుల్లో మూడు పర్యాయాలు రైతులతో సమావేశమైనప్పటికీ సమస్య కొలిక్కి రాకపోవడంతో పనులు ఆగిపోయాయి. రిజర్వాయర్ పరిధిలో శివన్నగూడెం (చర్లగూ డెం), నర్సిరెడ్డిగూడెం, రాంరెడ్డిపల్లి, వెంకెపల్లి, వెంకపల్లితండాల్లో ముంపునకు గురవుతున్న నిర్వాసితుల వివరాలు, ఇళ్లు, ఆస్తుల వివరాలను అధికారులు సర్వే చేస్తున్నారు. కిష్టారాంపల్లి రిజర్వాయర్‌కు సైతం భూసేకరణ సమస్య అడ్డంకిగా మారింది. ఇక్కడ కూడా రైతులు పనులకు అడ్డుపడి ఆపివేయించారు. శివన్నగూడెం రిజర్వాయర్ నిర్వాసితుల తరహాలోనే చింతపల్లి, గొట్టిముక్కల, సింగరాజుపల్లి, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల పరిధిలోని రైతులు కూడా ముందుగా తమకు పూర్తి పరిహారం చెల్లించి పునరావాసాలపై స్పష్టతనిస్తేనే పనులు జరగనిస్తామంటుండడం ఆందోళనకరంగా మారింది. డిండి ఎత్తిపోతల నిర్మాణానికి భూసేకరణ సమస్య అటు నిర్వాసితులతో పాటు ఇటు ఇరిగేషన్, అధికారులకు, కాంట్రాక్టర్లకు సమస్యగా మారగా ప్రభుత్వం ఎలా అధిగమించనుందన్నదీ ఆసక్తికరంగా మారింది.