తెలంగాణ

డిజిపి కార్యాలయం ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: కానిస్టేబుళ్ల నియామకాలకు జరిగిన పరీక్షల ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ పరీక్ష రాసిన అభ్యర్థులు తెలంగాణ డిజిపి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 2016లో కానిస్టేబుళ్ల నియామకానికి నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదైన సంగతి తెలిసిందే. తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని అభ్యర్థులు ఆరోపించారు. కాగా మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం, కేవలం 10శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించారని మహిళా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని విద్యార్థి, నిరుద్యోగ జెఎసి చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆరోపించారు. ఈ పరీక్షపై పలు అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని మానవతారాయ్ హెచ్చరించారు.
అక్రమాలు జరుగలేదు: బోర్డు చైర్మన్
కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళనకు గురికావద్దని, పరీక్ష ఫలితాలపై ఎలాంటి అక్రమాలు జరుగలేదని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన చెప్పారు.
కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో పెట్టండి
కానిస్టేబుళ్ల పరీక్ష ఫలితాల్లో అవకాశం కల్పించిన కటాఫ్ మార్కులను వెబ్‌సైట్‌లో పెట్టాలని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ఆదేశించారు. పరీక్ష ఫలితాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తారని, అప్పటికీ అభ్యర్థులు సంతృప్తి చెందకుంటే అభ్యర్థులు కోర్టును ఆశ్రయించవచ్చని డిజిపి తెలిపారు.