తెలంగాణ

టిజెఎసికి మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రజాసంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఎసి) నుంచి హైదరాబాద్ నగర శాఖ వైదొలిగింది. ఇప్పటికే తెలంగాణ ఉద్యోగ సంఘాలు, కేంద్ర ఉద్యోగ సంఘాలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ శ్రీధర్‌స్వామి నేతృత్వంలోని హైదరాబాద్ శాఖ కూడా వైదొలగడంతో టిజెఎసి షాక్ తింది. తెలంగాణ ఉద్యమంలో టిజెఎసిలో హైదరాబాద్ శాఖ కీలక భూమిక పోషించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల టిజెఎసి చైర్మన్ హోదాలో కోదండరామ్ చేసిన విమర్శలను టిఆర్‌ఎస్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు కోదండరామ్‌తో విభేదించి టిజెఎసి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి. అయినప్పటికీ తమతో కలిసి వచ్చేవారితో జెఎసిని కొనసాగిస్తామని కోదండరామ్ ప్రకటన చేయడం టిఆర్‌ఎస్‌కు ఆగ్రహం కలిగింది. దీంతో హైదరాబాద్ శాఖ కూడా టిజెఎసి నుంచి వైదొలిగినట్టు ప్రకటించడంతో టిజెఎసి, టిఆర్‌ఎస్‌కు మధ్య తలెత్తిన విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. తాజా పరిణామాలపై కోదండరామ్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.