తెలంగాణ

వడగాడ్పులపై నేడే జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: వడగాడ్పులపై (వడదెబ్బ) బుధవారం జాతీయ సదస్సు జరుగుతోంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) నేతృత్వంలో డాక్టర్ ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి సంస్థలో రెండురోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తోంది. వడగాడ్పుల ప్రభావం మనుషులపై ఎక్కువగా పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సందర్భంగా చర్చిస్తారు. సాధారణంగా వడగాడ్పులు మార్చి నుండి జూన్ వరకు ఉంటాయి. ఒక్కోసారి జూలైలో కూడా ఇవి కొనసాగుతాయి. వడగాడ్పుల వల్ల 2015 లో రెండువేల మంది మరణించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వడగాడ్పుల వల్ల మరణాలు ఎక్కువ జరగకుండా ఎన్‌ఎండిఎ నియమావళి రూపొందించింది. దాంతో 2016 లో వడగాడ్పుల మరణాలు గణనీయంగా తగ్గాయి.