తెలంగాణ

ర్యాలీకి అనుమతిపై పిటిషన్ ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం ఉపసంహరించుకుంది. పిటిషన్‌ను ఉపసంహరించుకున్న తర్వాత కోదండరామ్ 22న ముందు అనుకున్నట్లుగా ర్యాలీని నిర్వహించుతామని ప్రకటించిన విషయం విదితమే. నిరుద్యోగ ర్యాలీకి అనుమతి కోసం రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు విచారించారు. విచారణ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని ర్యాలీని ఆదివారానికి వాయిదావేసుకుంటారా లేక బుధవారం నిర్వహించదలుచుకుంటే వేరే ప్రత్యామ్నాయ మైదానాలను సూచించమంటారా అని అడిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపిస్తూ, నిజాం కాలేజీ, ఉస్మానియా వర్శిటీ, ఎన్టీఆర్ స్టేడియం, ఎల్‌బి స్టేడియంలలో ర్యాలీని నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ నెల 24వ తేదీన శివరాత్రి ఉండడం వల్ల ర్యాలీని వాయిదా వేసుకునే పరిస్థితుల్లో టి జాక్ లేదని, ఓయూ క్యాంపస్‌లో ర్యాలీని నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అనంతరం హైకోర్టు ఉస్మానియా వర్శిటీలో ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ ప్రారంభం కాగా, హోంశాఖ తరఫున న్యాయవాది హెచ్ వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ క్యాంపస్‌లో ఎటువంటి ర్యాలీల నిర్వహణకు అనుమతి లేదని, పోలీసులు గతంలోనే ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా జడ్జి జోక్యం చేసుకుని నాగోలులోని మెట్రో రైల్ మైదానంలో ర్యాలీని నిర్వహించుకుంటారా అని అడిగారు. హోంశాఖ న్యాయవాది బదులిస్తూ పోలీసులు నాగోలు ర్యాలీకి అనుమతి ఇస్తారని చెప్పారు. అనంతరం టిజాక్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. పిటిషనర్ కోరినట్లుగా కోర్టులో ఉపశమనం లభించలేదన్నారు.