తెలంగాణ

ప్రజల వద్దకే విశ్వవిద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రజల వద్దకు విశ్వవిద్యాలయం పేరుతో ప్రజాకళల పునరుజ్జీవానికి ప్రజల వద్దకే వెళ్లి వారికి శిక్షణ ఇస్తున్నామని తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. లలిత కళలు, సాహిత్యం, సంస్కృతి, ప్రజా కళలు పరిరక్షణకు అన్ని చర్యలూ చేపట్టామని ఆయన వెల్లడించారు. ఆంధ్రభూమి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధికి, వికాసానికి తీసుకున్న చర్యలతోపాటు వర్శిటీ కార్యకలాపాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.
జూలై 25న ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సాహిత్య పురస్కారాలు, ప్రతిభా పురస్కారాలు, విశిష్ట పురస్కారాలు అందించేందుకు మిత్రులతో కమిటీలు వేసి ఇంతవరకూ విస్మరించబడిన నిష్ణాతులకు అవార్డులు ఇచ్చాం, ఎంపిక సముచితంగా జరిగిందనే సానుకూల ప్రశంసలు పొందామని అన్నారు.
హలో విద్యార్థి-్ఛలో క్లాసురూమ్ అనే పిలుపునకు చాలా సానుకూల స్పందన వచ్చిందని, పిల్లలు క్లాసులకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల వద్దకు విశ్వవిద్యాలయం అనే మరో నినాదంతో 250 మంది మహిళలకు కోలాటం, చిడుతల శిక్షణ అందించామని అన్నారు. నాలుగైదు దళాలు ఏర్పడి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మూడు నాలుగైదు రోజులు ప్రదర్శనలు ఇచ్చారని పేర్కొన్నారు. 12 మెట్ల కినె్నరలో మొగలయ్య ఏకైక కళాకారుడని, ఆయనకు మూడు నెలలపాటు ఆయనతో శిక్షణ ఇప్పించామని, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉత్సవాల్లో, సూరత్ ఉత్సవాల్లో తెలుగు వర్శిటీ భాగస్వామ్యం అయిందని అన్నారు.
వర్శిటీలో షెడ్యూలు ప్రకారమే అన్ని పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. మలేషియాలో కూడా తెలుగు కేంద్రంలో పరీక్షలు నిర్వహించామని, అలాగే మలేషియా బృందం కూడా ఇక్కడకు వచ్చి వర్శిటీ కార్యకలాపాలు పరిశీలించిందని అన్నారు. రెండు నెలల వ్యవధిలో సిలికాన్ ఆంధ్రా మనబడి కార్యక్రమం కింద అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలు ముగిశాక స్నాతకోత్సవానికి ఒక పరిశీలకుడిని పంపిస్తామని చెప్పారు.
తెలుగు విశ్వవిద్యాలయంలో అవసరాలకు అనుకూలంగా కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించామని, విద్యానగర్‌లో గ్రంథాలయాన్ని, హాస్టల్ భవనాలను ఆధునిక సదుపాయాలతో పునర్నిర్మిస్తామని అన్నారు. మల్టీ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త కోర్సులు ప్రారంభిస్తామని అన్నారు. నైపుణ్య మెరుగుదల, ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలు దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సులు ప్రారంభించబోతున్నామని అన్నారు. 200 డిగ్రీ కాలేజీల్లో తమ విద్యార్థుల ద్వారా డిగ్రీ విద్యార్థులకు లలిత కళలు, జానపద, రంగస్థల కళల్లో శిక్షణ ఇవ్వబోతున్నామని, బాసర ట్రిపుల్ ఐటి, ఇతర విశ్వవిద్యాలయాలతో కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుని కళలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. మార్చిలో కీర్తిపురస్కారాలను ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. కరీంనగర్‌లో తెలుగు విశ్వవిద్యాలయ శాఖను కరీంనగర్‌లో ఏర్పాటు చేయబోతున్నామని, నల్గొండలో కూడా వర్శిటీ శాఖను ప్రారంభిస్తామని విసి సత్యనారాయణ తెలిపారు.