తెలంగాణ

స్టేను సవరించేందుకు హైకోర్టు సంసిద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: జీవో 123 ప్రకారం భూ సేకరణను నిలుపుదల చేస్తూ జనవరి 5న ఇచ్చిన స్టేను సవరించేందుకు హైకోర్టు మంగళవారం సంసిద్ధత వ్యక్తం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అఖ్తర్ కేసును విచారించారు. భూ నిర్వాసితులకే కాకుండా వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే వారికి పునరావసం కోసం ప్రభుత్వం జీవో 38ని జారీ చేసింది. అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదిస్తూ ఈ జీవో 123 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 49వేల ఎకరాల భూమి సేకరించినట్టు చెప్పారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేనాటికే 5138 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు చెప్పారు. మంచినీటి సరఫరా పనులు సైతం నిలిచిపోయాయని తెలిపారు. గ్రామంలో భూ సేకరణ వల్ల ఉపాధి కోల్పోతున్న ఇతరులకు పునరావాసం కోసం ప్రభుత్వం జివో 38ని విడుదల చేసినట్టు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పటి వరకు సేకరించిన భూమి వృథా అవుతుందని, ఇకపై సేకరించలేమని చెప్పారు. జీవో 123 నిలుపుదల వల్ల నీటిపారుదల ప్రాజెక్టులను, మంచినీటి పథకాలను ప్రభుత్వం కొనసాగించలేదని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మంచినీటి సమస్య ఉంది, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మంచినీటి పథకాలు, సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసి భూ సేకరణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 38పై కూడా అభ్యంతరాలు ఉన్నాయని, కౌంటర్ దాఖలు చేస్తామని నిర్వాసితులు, రైతుల తరఫున న్యాయవాది ఎ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చే సోమవారం నుంచి వ్యాజ్యాలపై తుది వాదనలు ప్రారంభించి త్వరగా తేలుస్తామని కోర్టు తెలిపింది.