తెలంగాణ

శ్రీవారికి మొక్కులు తీర్చుకున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 22: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే స్వామివారికి 5కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు చేయిస్తానని కెసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కులను బుధవారం సిఎం హోదాలో వచ్చి తీర్చుకున్నారు. ఈసందర్భంగా 14కేజీల 148 గ్రాముల బరువుకలిగిన బంగారుకమల సాలిగ్రామ హారాన్ని అలాగే 4కేజీల 924 గ్రాముల బరువు కలిగిన ఐదుపేటల మకర కంఠి హారాన్ని ఆయన శ్రీవారికి సమర్పించారు. శ్రీవారిని దర్శించుకోవడం కోసం బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో అప్పటికే టిటిడి ఆధ్వర్యంలో కోయంబత్తూరుకి చెందిన కీర్తిలాల్ కాళీదాస్ జ్యువలరీ సంస్థ చేత తయారు చేయించి టిటిడి ఖజానాలో భద్రపరచిన ఆభరణాలను రంగనాయక మండపంలో ఓ ఆసనంపైకి చేర్చారు. ఈక్రమంలో కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు రంగనాయక మండపం వద్దకు చేరుకుని ఆభరణాలకు వేదపండితులు వేదాలు వల్లిస్తుండగా పవిత్ర సంప్రోక్షణ నిర్వహించి పూజలు చేశారు. అనంతరం నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆభరణాలను వెండి పళ్లెంలో ఉంచి ముందు నడుస్తుండగా రంగనాయక మండపం నుంచి మూలవిరాట్ సన్నిధికి కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా తాను భగవంతుడికి మొక్కుకున్న ఆభరణాలను స్వామి సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులకు అందజేశారు. ఆభరణాలను స్వామివారి పాదాల వద్ద ఉంచారు. అనంతరం కెసిఆర్ దంపతులు స్వామివారిని ప్రార్థించుకుని వెలుపలికి వచ్చారు. కాగా కెసిఆర్ సర్కార్ తయారు చేయించి ఇచ్చిన ఆభరణాల విలువ రూ.5,02,79,170 కాగా, బరువు 19కేజీల 072 గ్రాములు.
అమ్మవారికి బంగారు పాలపిట్ట ముక్కు పుడక
తిరుమలేశునికి మొక్కులు తీర్చుకున్న తెలంగాణ సి ఎం అక్కడ నుంచి తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి చేరకున్నారు. ఆయనకు టిటిడి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టిటిడి పాలక మండలి చైర్మన్ చదలవాడకృష్ణమూర్తి, జె ఇ ఓలు శ్రీనివాసరాజు, పోలభాస్కర్‌లు ఆయనకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారికి తయారు చేయించిన విలువైన రాళ్ళతో పొదిగిన పాలపిట్టను అమర్చిన బంగారు ముక్కుపుడకను అమ్మవారికి సమర్పించారు.
అనంతరం అమ్మవారికి కుంకుమార్చన చేయించారు. ఈ సందర్భంగా గజ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం జె ఇ ఓ పోలభాస్కర్ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వెళ్లారు.