ఆంధ్రప్రదేశ్‌

కోట్లకు పడగెత్తిన తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: విశాఖ జిల్లా భీమునిపట్నం తహశీల్దారు బిటివి రామారావు, ఆయన బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, హైదరాబాద్, రాజమండ్రి పట్టణాల్లోని ఏడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రామారావుకు చెందిన విశాఖపట్నంలోని స్వగృహంలో రూ.14.5 లక్షల నగదు, కిలో బంగారు ఆభరణాలు, పలు స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రామారావు అల్లుడు నివాసం ఉంటున్న రాజమండ్రిలో జరిపిన సోదాల్లో రూ.28 లక్షల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రామారావు ఇంట్లో నాలుగు బ్యాంకు లాకర్లను ఎసిబి అధికారులు గుర్తించారు. వీటిని తెరవాల్సి ఉంది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ప్రకారం విశాఖ నగరంలోని కంచరపాలెం, గోపాలపట్నంలో రెండు వాణిజ్య సముదాయాలు, వేపగుంటలో ఇల్లు, నర్శింహనగర్‌లో రెండు ప్లాట్లు సహా అక్కయ్యపాలెంలో ఉంటున్న ఇంటికి సంబంధించిన పత్రాలు ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.4 కోట్ల మేర ఆక్రమాస్తులు కూడబెట్టినట్టు ఎసిబి గుర్తించింది. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని ఎసిబి అధికారులు పేర్కొన్నారు. రామారావు తండ్రి విశాఖ జిల్లా రావికమతం మండలం గొంప గ్రామ కరణంగా పనిచేశారు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రామారావు విశాఖ కలెక్టరేట్‌లో స్టెనోగ్రాఫర్‌గా రెవెన్యూ శాఖలో విధుల్లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 2011లో డిప్యూటీ తహశీల్దారుగాను, అనంతరం తహశీల్దారుగాను పద్నోతులు పొందారు. మరో ఆశ్చర్య కరమైన అంశం ఏమిటంటే తహశీల్దారు రామారావు ఏకంగా తన ఇంట్లోనే ప్రైవేటుగా రెవెన్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎసిబి సోదాల్లో రామారావు ఇంట్లో ఏకంగా పట్టాదార్ పాసుపుస్తకాలు బయటపడటంతో నివ్వెరపోవడం అధికారుల వంతైంది.

కర్నూలులో 39.4 డిగ్రీలు
వడదెబ్బకు ఒకరి మృతి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఫిబ్రవరి 22: శివరాత్రి ఉత్సవాల సమయంలో చలితో వణికి పోవాల్సిన ప్రజలు ఎండల ధాటికి విలవిలలాడుతున్నారు. మండుతున్న ఎండల ధాటికి కర్నూలు జిల్లా హాలహర్వి మండలం పత్తి రైతు రుద్రగౌడు ఆదోని మార్కెట్ యార్డులో వడదెబ్బకు గురై బుధవారం మరణించారు. జిల్లాలో సగటున 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం వాతావరణ నిపుణులను సైతం ఆశ్చర్యపర్చింది. ఈ సమయంలో సగటున 32 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుందని వారు అంటున్నారు. అయితే అంతకు నాలుగు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం రానున్న వేసవి తీవ్రతకు ముందస్తు హెచ్చరికగా వారు భావిస్తున్నారు. జిల్లాలోనే కాకుండా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కూడా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల స్థాయిలో ఉండాల్సి ఉండగా 22 డిగ్రీలుగా నమోదు అవుతోంది. గత రెండు రోజులుగా పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదోని మార్కెట్ యార్డుకు తన పొలంలో పండిన పత్తిని తీసుకువచ్చిన రైతు రుద్రగౌడు ఎండలో పత్తి బేళ్లపై కూర్చొని అమ్మడానికి ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. అయితే ఎండల ధాటికి డీహైడ్రేషన్‌కు గురై స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరో మూడు, నాలుగు రోజులు స్థిరంగా ఉంటాయని ఆ తరువాత క్రమేణా పెరుగుదల కనిపిస్తుందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

వేసవిలో అప్రమత్తం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 22: రానున్న వేసవి సీజన్ దృష్ట్యా క్షేత్రస్థాయిలో మంచినీరు, పశువులకు దాణా, వేసవిలో వచ్చే వివిధ ఆరోగ్య సమస్యలు, రైతులకు సంబంధించిన అంశాలపై ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా గుర్తించిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు పంపిస్తామని ఆయన తెలిపారు. విజయవాడ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో బుధవారం ఆర్‌డబ్ల్యుఎస్, పట్టణాభివృద్ధి సంస్థ, వ్యవసాయ పశు సంవర్థక వైద్య ఆరోగ్య తదితర సమన్వయ శాఖల అధికారులతో వేసవి సీజన్ దృష్ట్యా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా శేషగిరిబాబు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనురించి పటిష్టమైన చర్యలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. వేసవిలో ప్రజలకు మంచినీటి సమస్య ఉత్పన్నం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను గ్రామాలకూ అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పంటల పరిరక్షణ, పశువులకు దాణా, నీటి సమస్యలపై అదే స్థాయిలో ప్రాధాన్యతను కల్పించాలన్నారు. ల జిల్లా స్థాయిలో కలెక్టర్ మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్, రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. కార్మిక శాఖ, పశు సంవర్థక శాఖ, రవాణా శాఖ, విద్యాశాఖ, అగ్నిమాపక శాఖ, సమాచార శాఖ అధికారులతో ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మూడంచెలుగా కార్యాచరణ ప్రణాళికలను జిల్లా స్థాయిలో అమలు చేయాలని తెలిపారు.