తెలంగాణ

ముస్తాబైన శివాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్రంలోని శివాలయాలన్నీ ‘శివరాత్రి’కి ముస్తాబయ్యాయి. వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయం, కాళేశ్వరంలోని ముక్తేశ్వర-కాళేశ్వర ఆలయం, వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం, వరంగల్ నడిబొడ్డున ఉన్న వేయికాళ్ల దేవాలయం, నాగర్‌కర్నూలు జిల్లాలోని ఉమామహేశ్వరస్వామి ఆలయం తదితర దేవాలయాలకు ఇప్పటికే రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. పెద్ద చిన్న దేవాలయన్నీ కలిపి రాష్ట్రంలో పదివేలకు పైగా శివాలయాలున్నాయి. అన్ని ఆలయాల్లో కూడా శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఎండోమెంట్స్ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులు లక్షల సంఖ్యలో శివాలయాలకు వెళ్లడం పరిపాటి. అందువల్ల తాగునీరు, ప్రసాదాల విక్రయం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఉండి, మరురోజు ఉపవాసదీక్ష విరమిస్తారు. శివరాత్రిరోజు ఉపవాసం ఉండే భక్తులు చాలా మంది నిరాహారంగా ఉండకుండా పళ్లు తినడం ఆనవాయితీగా వస్తోంది. శివుడి పూజకోసం పూలు, పళ్లు ఈ సందర్భంగా ఎక్కువగా అవసరం అవుతాయి. దాంతో వ్యాపారులు గురువారం నుండే ప్రధాన రోడ్లపై పూలు, పళ్లు అమ్మకంలో నిమగ్నమయ్యారు. శివరాత్రి రోజు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు దేవాలయాలకు వెళుతుండటం వల్ల అన్ని దేవాలయాల్లోనూ విఐపిలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పుణ్యక్షేత్రాలకు
ప్రత్యేక బస్సులు
మార్చి రెండో వారంలో మినీ ఏసి బస్సులు ప్రారంభం
రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణలోని అన్ని పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పి మహేందర్ రెడ్డి తెలిపారు. శివరాత్రి సందర్భంగా 1600 ప్రత్యేక బస్సులు నడుపనున్నామని గురువారం మీడియాకు తెలిపారు. తెలంగాణలోని శైవక్షేత్రాలకు గురువారం సాయంత్రం నుంచే ప్రత్యేక బస్సు సర్వీసులు నడపడం ప్రారంభమయ్యాయన్నారు. ప్రత్యేకంగా నడిపే బస్సులో వేములవాడకు 290, కాళేశ్వరానికి 130, ఏడుపాయలకు 190, శ్రీశైలంకు 552, కీసరగుట్టకు 350, యాదాద్రికి 65 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం సమీపంలోని ప్రముఖ దేవాలయాలు చిలుకూరు బాలాజి, సంఘీ టెంపుల్, నాచగిరిగుట్ట, కొమురవెల్లి, చెర్వుగట్టు, వేములకొండ వంటి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుపనున్నట్టు మంత్రి చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులు మహాత్మగాంధీ బస్‌స్టేషన్, పికెట్ జూబ్లిబస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ (రేతిఫైల్) బస్టాండ్‌ల నుంచి ప్రతి గంటకు ఒక సర్వీసు నడుస్తుందన్నారు. అలాగే వచ్చే నెల రెండో వారంలో మినీ ఏసి బస్సులు నడుస్తాయని, ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ఈ ఏసి బస్సులను ప్రారంభిస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.