తెలంగాణ

వడగాడ్పులతో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఎండాకాలంలో వడగాడ్పుల వల్ల నష్టం జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వాతావరణ శాఖ, స్వచ్ఛంద సేవాసంస్థల సహకారం తీసుకోవాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎనిడిఎంఎ) నిర్ణయించింది. ఎన్‌డిఎంఎ నేతృత్వంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి)లో నిర్వహించిన రెండురోజుల వర్క్‌షాప్ గురువారం ముగిసింది. ‘వడగాడ్పుల దృష్ట్యా కార్యాచరణ ప్రణాళిక’ అంశంపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు మాట్లాడారు. అందరి సూచనలు సలహాలు తీసుకున్నామని, వారంరోజుల్లోగా ప్రత్యేక కార్యారణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఎన్‌డిఎంఎ సభ్యుడు ఆర్‌కె జైన్ తెలిపారు. ఎండాకాలంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. వేడిగాడ్పుల మూలంగా ప్రజలు ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదన్నదే తమ ఉద్దేశమని, ఇందుకోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు, ఎన్‌జిఓలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.