తెలంగాణ

అరుదైన వ్యాధికి అద్భుతమైన చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: అరుదైన ‘అలగిల్లే సిండ్రోమ్’ అనే జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హైదరాబాద్ నగరానికి చెందిన ఐదేళ్ల చిన్నారి పార్వతి రోహ్రోకి అపోలో వైద్య నిపుణుల బృందం ఒకేసారి కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. వైద్య చరిత్రలోనే ఈ సర్జరీ అరుదైనదిగా వైద్యనిపుణులు చెబుతున్నారు. అపోలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగం అధిపతి డాక్టర్ మనీష్ సి వర్మ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ గిరీష్ వారియర్, అపోలో జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సంగీతారెడ్డి గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అరుదైన ఈ సర్జరీలో 10 వైద్య విభాగాలకు చెందిన 20మంది నిపుణులు పాల్గొన్నట్లు తెలిపారు. గుండె, కాలేయం పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఒకదానికి చికిత్స చేస్తే మరొకటి విఫలమయ్యే పరిస్థితిలో ముందు దేనికి చికిత్స చేయాలో తెలీని విపత్కర పరిస్థితిలో వైద్యులు సజీవ దాత సాయంతో కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీని కొన్ని గంటల తేడాలో విజయవంతంగా నిర్వహించి వైద్య చరిత్రలో సంచలనం సృష్టించారని వెల్లడించారు. లక్ష మందిలో ఒకరికి వచ్చే ఈ అరుదైన వ్యాధి కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఎముకల పనితీరుపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు. గత నెల 23న ఓపెన్ హార్ట్ సర్జరీని 8 గంటలపాటు సుదీర్ఘంగా నిర్వహించామని, అనంతరం 12 గంటలపాటు చిన్నారి గుండె పనితీరును, కాలేయ పరిస్థితిని దిగజారకుండా పరిశీలించడం జరిగిందని వివరించారు. ఆ తర్వాత సజీవ దాత నుంచి లివర్‌ను తీసుకుని జనవరి 24న ఉదయానే్న కాలేయ మార్పిడి చేసినట్లు తెలిపారు. అనంతరం రోగి పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతూ వచ్చిందని అన్నారు.