తెలంగాణ

విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలకు ముగిసిన గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ పెంపుదల ప్రతిపాదనలకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన డెడ్‌లైన్ గురువారం ముగిసింది. 23వ తేదీ లోపల ప్రతిపాదనలు ఇవ్వనిపక్షంలో ప్రతిపాదనలు ఇచ్చినట్లుగా భావించి, వార్షిక రెవెన్యూ నివేదికను పరిగణనలోకి తీసుకుని టారిఫ్‌ను ఖరారు చేస్తామని ఇప్పటికే టిఎస్‌ఇఆర్‌సి ప్రకటించింది. అయితే 28వ తేదీ వరకు ప్రతిపాదనలు సమర్పించేందుకు గడువు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ శాఖ మండలిని కోరినట్లు సమాచారం.
రాష్ట్రంలో విద్యుత్ రెవెన్యూ లోటు 9000కోట్ల వరకు ఉందని, ప్రభుత్వం సబ్సిడీని రూ.7000 కోట్లు భరిస్తే, మరో రెండు వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు ఇస్తామని డిస్కాంలు ప్రభుత్వానికి తెలిపాయి. కాని ప్రభుత్వం ఈ ప్రతిపాదనల ఆమోదానికి సుముఖంగా లేదు. దీంతో ప్రతిపాదనలను మండలికి ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.