తెలంగాణ

స్కూళ్లలో స్కౌట్స్, గైడ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను తక్షణం అభివృద్ధి చేయాలని ఆ నియోజకవర్గ ఎంపి కవిత , ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి విజ్ఞప్తి చేశారు. దానిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్యను, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్‌లను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎంపి కవిత వెంట ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సంజీవరావు, విద్యాసాగరరావు ఉన్నారు. కొన్ని స్కూళ్లను అప్ గ్రేడ్ చేయాలని కూడా వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి వౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే అద్దె భవనాల్లో ఉన్న కాలేజీలు, స్కూళ్లకు సొంత భవనాలను నిర్మించాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఇంగ్లీషు మీడియం స్కూళ్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, తెలుగు మీడియం స్కూళ్లను ఇంగ్లీషు మీడియంకు మార్చాలని, కుదరకుంటే కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయాలని కవిత కోరారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుపుతున్న కాలేజీలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వాటిని నడిపించాలని కోరారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను తప్పనిసరి చేయాలని, అలాగే ఫలితాల్లో కొంత వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కోరారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ కింద కొన్ని నిధులు, ఎమ్మెల్యే ఫండ్స్ కలిపి తాము ప్రభుత్వం నుండి మరికొన్ని నిధులు కలిపి ఇస్తామని పేర్కొన్నారు. టాయిలెట్స్ నిర్వహణకు ప్రతి హైస్కూల్‌కు ఏటా లక్ష రూపాయిలు గ్రాంట్ ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్, ఫర్నీచర్ ఉండాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశామని కడియం శ్రీహరి తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎన్‌సిసిని తప్పనిసరి చేసే ఆలోచన ఉందని అన్నారు.