తెలంగాణ

పుంసత్వ పరీక్ష నిర్వహించడం ప్రాథమిక హక్కుకు భంగం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: వివాహ సంబంధ వివాదం కేసులో ఒక వ్యక్తిని పుంసత్వ పరీక్ష చేయించుకోవాలని కోర్టు ఆదేశించడమంటే ప్రాథమిక హక్కుకు భంగం కలిగించినట్లుగా భావించరాదని హైకోర్టు పేర్కొంది. పోలీసులు ఈ పరీక్షను అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వైద్యుల ద్వారా నిర్వహించడం దర్యాప్తులో భాగమని కోర్టు పేర్కొంది. వరకట్నం, మోసం కేసులో సెషన్స్ కోర్టు పోలీసులను తమకు పుంసత్వ పరీక్షలను నిర్వహించాలని ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివ శంకర్ రావు కొట్టివేశారు. కాగా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పిటిషనర్ ఇప్పటికే పోలీసులు తమపై కేసు నమోదు చేశారని, తమను అవమానపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు.