తెలంగాణ

వరంగల్ జిల్లా సిపిఎంలో విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 25: వరంగల్ అర్బన్ జిల్లా సిపిఎం నాయకుల మద్య ఏర్పడిన విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే టివి ఛానెల్ కోసం ఇచ్చిన డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పార్టీ కార్యకర్తలు కొందరు శుక్రవారం పార్టీ నాయకులపై దాడిచేయగా, శనివారం ఏకంగా పార్టీ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయ తలుపులు, కిటికీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి పార్టీ కార్యాలయానికి తాళం వేయించారు. అసలు నాయకత్వం ఎవరిదో తేలేంత వరకు పార్టీ కార్యాలయాన్ని మూసి ఉంచాలని సిపిఎం నాయకులను ఆదేశించారు. శుక్రవారం పార్టీ జిల్లా సమావేశంలో రెండు గ్రూపులకు చెందిన నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం దాడులకు దారితీసింది. ఈ సంఘటనలో పార్టీ నాయకులు వెంకట్, రాగుల రమేష్, సింగారపు బాబు గాయపడ్డారు. దాంతో పార్టీ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయటం, పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావటం, పనిలోపనిగా జిల్లా కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయటం వెంటవెంట జరిగిపోయింది. పార్టీ సమావేశంలో జరిగిన దాడి నేపథ్యంలో పార్టీ జిల్లాకమిటీ సభ్యులు దుబ్బ శ్రీనివాస్, సురేష్‌లతోపాటు మరో ముగ్గురు ముఖ్య కార్యకర్తలను పార్టీనుంచి తొలగిస్తూ జిల్లా కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రత్యర్థివర్గానికి పుండుపై కారం రాసిన మాదిరిగా మారింది. శనివారం మధ్యాహ్నం పార్టీలోని ప్రత్యర్థివర్గం మద్దతుదారులు హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంపై దాడికి దిగారు. అప్పటికే అక్కడ రక్షణగా ఉన్న పోలీసు సిబ్బందిని పక్కకునెట్టి గేటు తలుపులు నెట్టి కార్యాలయంలోకి ప్రవేశించిన కార్యకర్తలు విధ్వంసకాండకు దిగారు. ఈలోగా విషయం తెలిసి సెంట్రల్ జోన్ డిసిపి వేణుగోపాలరావు, హన్మకొండ ఏసిపి మురళీధర్, పలువురు సిఐలు అదనపు బలగాలతో అక్కడకు చేరుకుని అక్కడి పరిస్థితులను గమనించిన అనంతరం నాయకులను బయటకు రప్పించి కార్యాలయానికి తాళాలు వేయించారు.

చిత్రం..ఫర్నిచర్‌ను ధ్వంసం చేస్తున్న దృశ్యం