తెలంగాణ

కాంగ్రెస్ నేతలను జైల్లో పెట్టడం పెద్దపనేమీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టడం పెద్దపనేమీ కాదని, తాము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. తాము రాజకీయాలు చేయదలుచుకోలేదని, కాంగ్రెస్ నాయకులపై కేసులు మోసి జైళ్లకు పంపాలనే ఆలోచన తమకు లేదని, వారు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని, అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఎప్పుడో ఓసారి వారి పాపం పండక తప్పదని ఆయన అన్నరా. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి మహబూబ్‌నగర్‌కు విచ్చేన ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జలయజ్ఞంలో కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుల్లో చేసిన అవినీతి చాలా ఉందని, పనులు చేయకుండానే ఇపిసి విధానాన్ని తెచ్చి వందల కోట్ల రూపాయలు దండుకుని ప్రజాధనాన్ని లూటీ చేశారని మంత్రి ఆరోపించారు. తెలంగాణలో 32 ప్రాజెక్టులలో కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, వాటిని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టి, వారి బండారాన్ని బట్టబయలు చేస్తానని ఆయన హెచ్చరించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తూ రైతులకు సాగునీరు ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కడుపుమంట రేగుతోందని ఆయన ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపడానికి కేసులు వేసి ప్రభుత్వానికి ఇబ్బందులు తేవాలని చూస్తుంటే కూడా తాము సహనం వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో ఇలాంటి ప్రతిపక్షం ఉండడం ప్రజల దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిపై ప్రజలు సైతం విసుగుచెందుతున్నారని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటిన మెదక్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని, అదే తెలంగాణ రాష్ట్రం వచ్చాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో సింగూరు ప్రాజెక్టు నుండి 30 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత తమదని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టు మంజూరు కాకుండానే నిధులు నొక్కేశారని, దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులు చేపట్టకుండానే దాదాపు రూ.800 కోట్లు డ్రా చేసుకుని అవినీతికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులు టిఆర్‌ఎస్ పార్టీని విమర్శించడమంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టం అభివృద్ధికి అడ్డంకిగా మారిందని, కేంద్రంలో సైతం దీనిని సవరించే ప్రయత్నం జరుగుతుంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డంపడుతోందని ఆయన ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేస్తున్నానని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దామని, ఎవరేంతపని చేసుండ్రో ఎవరెంత దోపిడీ చేశారో తేల్చుకుందామని మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు