తెలంగాణ

నాగార్జున కొండను సందర్శించిన అంతర్జాతీయ బౌద్ధ ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 25: నాగార్జునసాగర్‌ను శనివారం అంతర్జాతీయ బౌద్ధ ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈనెల 23నుండి 26వరకు హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌లో అంతర్జాతీయ తెలంగాణ బౌద్ధ వారసత్వ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 16 దేశాల నుండి బౌద్ధ ప్రతినిధులు, బౌద్ధ భిక్షువుల హాజరయ్యారు. 3వరోజు అయి న శనివారం ఈ ఉత్సవాల్లో భాగంగానే బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ ప్రతినిధులను నాగార్జునసాగర్ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. దీనిలో భాగంగా 16 దేశాలకు చెందిన 32 మంది విదేశీ బౌద్ధ ప్రతినిధులతోపాటు పర్యాటక సంస్థ ఉన్నతాధికారులు సాగర్‌కు చేరుకున్నారు. విజయవిహార్ అతిధిగృహానికి చేరుకున్న విదేశీ బౌద్ధ ప్రతినిధుల బృందానికి తెలంగాణ పర్యాటక అధికారులు సంప్రదాయ లంబాడి నృత్యాలతో, హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ టూరిజం జనరల్ మేనేజర్ మనోహర్, ఎజెఎం జోయల్ స్వాగతం పలికారు. అనంతరం ఈ బృందం తెలంగాణ టూరిజం లాంచిలో నాగార్జునకొండను సందర్శించారు. అక్కడ వీరు మ్యూజియంలోని పాలరాతి బౌద్ధ శిల్పాలను వీక్షించారు. అనంతరం సింహళ విహారం, మహాస్థూపం వద్ద ప్రార్థన నిర్వహించారు. తరువాత బుద్ధవనంకు చేరుకుని అక్కడి బుద్ధుని పాదాలకు పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనంలోని మ్యూజియాన్ని, బుద్ధవనంలోని జాతకపార్క్, స్థూపాపార్క్‌ను సందర్శించారు. వీరితోపాటు ఎఇ ఆంజనేయులు, సాంబశివరావు, శ్యాంసుందర్ ఉన్నారు.