తెలంగాణ

సర్కారు నిర్లక్ష్యమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే నగరంలోని గోషామహల్, అంబర్‌పేట్ ప్రాంతాల్లో ఇఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా 17ఇఎస్‌ఐ డిస్పెన్సరీలు, ఐదు ఆసుపత్రులు నిర్మించేందుకు పరిపాలనాపరమైన ఆమోదం ఇచ్చామని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్మాణానికి స్థలాలు ఇవ్వడం లేదన్నారు. ఉదాహరణకు గోషామహాల్ డిస్పెన్సరీ పక్కన ఉన్న స్థలంలో తాను, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి సుమారు 18 నెలలు అవుతున్నదని తెలిపారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఆ స్థలాన్ని ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి అప్పగించలేదని, ట్రాన్స్‌కోకు కేటాయించినట్లు తనకు సమాచారం ఉన్నదని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా 383 కొత్త ఇఎస్‌ఐ డిస్పెన్సరీలను, 68 ఆసుపత్రులను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో 15 డిస్పెన్సరీలు, ఐదు ఆసుపత్రులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న డిస్పెన్సరీలన్నింటినీ ఆరు పడకల ఆసుపత్రులుగా మార్చనున్నట్లు ఆయన వివరించారు. పటాన్‌చెరులో కూడా 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా బీబీనగర్, రామగుండం, కవాడీగుడాలో కూడా 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందుకు అవసరమైన భూమి కేటాయించాలని ఆయన కోరారు. ఒకవేళ భూమి ఇవ్వలేకపోతే అద్దె భవనాలు చూపించాలని, తామే వాటికి అద్దె చెల్లిస్తామని అన్నారు. తెలంగాణలో ఏర్పాటైన 31 జిల్లాల్లో 6 పడకల ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి కార్మికులకు వైద్య సేవలందిస్తామని ఆయన తెలిపారు.
తాండూరులోనూ..
తాండూరులో ఇఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి పి. మహేందర్ రెడ్డి, బిజెపి నాయకుల కోరికను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్, నల్లల చెరువు, ఖమ్మంలో డిస్పెన్సరీలు, నల్లగొండ, సూర్యాపేట, మహేశ్వరం, ఘట్‌కేసర్, కోదాడ, ఆమన్‌గల్లు, కల్వకుర్తి, వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్‌లో ఆరు పడకల ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి టి. హరీష్ రావు సిద్ధిపేటలో ఇఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారని ఆయన తెలిపారు.
గ్రాట్యుటీ పెంపు
ఇలావుండగా, గ్రాట్యుటీని 10 నుంచి 20 లక్షల చేయడానికి వీలుగా గ్రాట్యూటీ చట్టాన్ని (1972) ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో సవరించనున్నట్లు దత్తాత్రేయ వివరించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి వ్యాపార సరళీకరణ చేస్తున్నామని, 56 రిజిస్టర్స్ స్థానే 9 చట్టాలుగా మార్చామన్నారు. కాంట్రీబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) తేవడం వల్ల తమకు నష్టం వాటిల్లుతున్నదని కార్మికులు చేస్తున్న ఆందోళన గురించి ప్రశ్నించగా, దీనిపై పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు దత్తాత్రేయ సమాధానమిచ్చారు. అమెరికాలో కూచిభట్ల శ్రీనివాస్‌ను హతమార్చడం సహించరానిదని, జాత్యాంహకారానికి నిదర్శనమని దత్తాత్రేయ దుయ్యబట్టారు.